రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) నేడు రైతులకు రెండు శుభవార్తలు చెప్పనున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొంటూ ఉండడంతో,  ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసి తమ శతశుద్ధిని చాటుకోవాలనే పట్టుదలతో రేవంత్ ఉన్నారు.

 Cm Revanth Reddy Good New To Farmers Details, Revanth Reddy, Telangana Cm, Telan-TeluguStop.com

  దీనిలో భాగంగానే ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తున్నారు.ఈ మేరకు రైతులకు( Farmers ) నేడు రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పనున్నారు.

రైతులకు రెండు లక్షల రుణమాఫీని పూర్తిగా అమలు చేసేందుకు ₹3,000 కోట్లను సిద్ధం చేసుకున్నారు.ఈ నిధుల ద్వారా ప్రభుత్వం లబ్ధిదారులకు రుణమాఫీ చేయనుంది.

దీనికి సంబంధించిన ప్రకటన నేడు రేవంత్ రెడ్డి చేయనున్నారు.మహబూబ్ నగర్ లో నేడు రైతు పండుగ సదస్సు జరగనుంది.

Telugu Farmers, Farmersloan, Mahabubnagar, Raithu Bharosa, Raithu Runamafi, Reva

ఈ సభకు రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు.ఈ సభలోనే రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు.మహబూబ్ నగర్ జిల్లా రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో , ఇక్కడే ప్రకటన చేస్తే తనకు రాజకీయంలో కలిసివస్తుంది ఆయన భావిస్తున్నారు.  ఇప్పటికే రెండు లక్షల రూపాయల రుణమాఫీని తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) అమలు చేస్తుంది .ఈ సభలోని రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి రైతులకు చెక్కులను కూడా రేవంత్ పంపిణీ చేయనన్నట్లు సమాచారం.  ఇప్పటి వరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అందని రైతులను అధికారులు గుర్తించారు.

Telugu Farmers, Farmersloan, Mahabubnagar, Raithu Bharosa, Raithu Runamafi, Reva

వీరికి ఈరోజు చెక్కులను అందజేయనున్నారు.సాంకేతిక కారణాలతో రుణమాఫీ జరగకపోవడంతో ఈ నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి తో పాటు , మంత్రులు కూడా అనేక సభల్లో ప్రకటిస్తూ ఉన్న నేపథ్యంలో, నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.రుణమాఫీ తో పాటు రైతు భరోసాపై( Rythu Bharosa ) కూడా రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నట్లు సమాచారం.  సంక్రాంతి నుంచి ఎకరాకు 7500 పెట్టుబడి సాయాన్ని అందిస్తామని రేవంత్ ఈ సభలోని ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించారట.అయితే కేవలం సాగు భూములు మాత్రమే రైతు భరోసా అందించనున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube