వావ్, ఆటోను మినీ లైబ్రరీగా మార్చేసిన డ్రైవర్.. బుక్స్ ఫ్రీగా తీసుకోవచ్చట..

బెంగళూరు నగరం( Bengaluru ) ఇన్నోవేటివ్ పర్సన్స్‌కు కేరాఫ్ అడ్రస్.ఇక్కడ ఆటో డ్రైవర్లు( Auto Drivers ) కూడా అద్భుతమైన క్రియేటివిటీని కనబరుస్తుంటారు.

 Auto Driver In Bengaluru Has Turned His Vehicle Into A Mini Library Details, Ban-TeluguStop.com

తాజాగా ఒక ఆటో డ్రైవర్ తన ఆటోను ‘మినీ లైబ్రరీ’గా( Mini Library ) మార్చి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.బెంగళూరులోని ట్రాఫిక్‌లో స్టక్ అయి పోయినప్పుడు చాలా మంది విసుగు చెందుతారు.

అలాంటి సమయంలో తన ఆటోలోని బుక్స్‌ను ఫ్రీగా చదువుకోవచ్చని ఈ డ్రైవర్ పాసింజర్లకు చెబుతున్నారు.ఈ ఆటోలో ప్రయాణించే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని మరింత ఆనందంగా గడపడానికి పుస్తకాలను చదవవచ్చు.

లింక్డ్ఇన్‌లో రావిళ్ల లోకేష్ అనే వ్యక్తి ఈ ఆటో ఫొటోను పంచుకుంటూ దీన్ని ‘బెంగళూరు స్టైల్’( Bengaluru Style ) అని పిలిచారు.ఆయన తీసిన ఫొటోలో ఆటోలోని బుక్స్ కనిపించాయి.ఆ పుస్తకాల పైన “కావాలంటే ఎవరైనా ఉచితంగా బుక్స్ తీసుకోవచ్చు” అని ఒక చిన్న నోట్ రాసి ఉంది.ఆయన దగ్గర ఫిలాసఫీ, ఆధ్యాత్మికత గురించి పుస్తకాలు ఉన్నాయి.

రావిళ్ల లోకేష్ ఈ విషయాన్ని పంచుకుంటూ, “బెంగళూరులో మాత్రమే ఆటోలో ఉచితంగా లైఫ్ గైడెన్స్, ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది” అని రాశారు.ఆయన తన స్నేహితుడు ఈ ఆటోను చూసినప్పుడు ట్రాఫిక్‌లో స్టక్ అయి ఉన్నాడని కూడా చెప్పారు.

లోకేష్ తన పోస్ట్‌లో, ఆ ఆటో డ్రైవర్ దగ్గర “వై డివోర్సెస్?” లాంటి పుస్తకాల నుంచి “గాడ్ లవ్స్‌ యూ” లాంటి పుస్తకాల వరకు అన్ని రకాల బుక్స్ ఉన్నాయని చెప్పారు.ఈ డ్రైవర్‌ బెంగళూరు ప్రయాణికుల గురించి గొప్పల ఆలోచన చేయడం బాగా నచ్చింది అని అన్నారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.ఒక వ్యక్తి ఈ పోస్ట్‌కు కామెంట్ చేస్తూ, “బెంగళూరు వైబ్స్ అంటే ఇదే! ఆటో డ్రైవర్ జీవిత పాఠాలు చెప్పడం గ్రేట్.

బెంగళూరు నిజమైన స్పిరిట్ అంటే ఇదే.ఇది నాకు చాయ్ స్టాల్స్ రకరకాల జ్ఞానం పంచుకునే అనుభవాన్ని గుర్తు చేస్తుంది” అని రాశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube