సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు సక్సెస్ ల కోసం పరితపిస్తూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే హీరోలకు మంచి విజయాలను అందించిన దర్శకులకు స్టార్ హీరోలు పిలిచి మరి ఇంకో అవకాశం ఇస్తూ ఉంటారు.
వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేసిన దర్శకులను మాత్రం అసలు పట్టించుకోరు.ఇక ఫ్యూచర్ లో వాళ్ళతో సినిమాలు చేసే సాహసం కూడా చేయరు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథలో మరొక హీరో చేసి సక్సెస్ లను సాధించిన సందర్భాలు చాలా ఉన్నాయి.
అలాగే ఫెయిల్యూర్స్ ను మూటగట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.అయితే కథ జడ్జిమెంట్ లో హీరోలు కొంతవరకు సరైన డిజిజన్ ను తీసుకుంటే మరి కొంతమంది మాత్రం జడ్జిమెంట్ ని అంచనా వేయలేక ఢీలా పడుతూ ఉంటారు.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకునే స్టార్ హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.ఇక వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) చాలా సినిమాలను మిస్ చేసుకున్నాడు.
ఇక ఆయన మిస్ చేసుకున్న సినిమాలతో కొంతమంది స్టార్ హీరోలుగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి.అయితే ఎన్ని సినిమాలు మిస్ చేసుకున్నా కూడా ఆయన ఒక సినిమా విషయంలో మాత్రం తన జడ్జిమెంట్ ని బలంగా నమ్మాడనే చెప్పాలి.ఇక వక్కంతం వంశీ( Vakkantham Vamsi ) దర్శకత్వంలో అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా వచ్చిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’( Naa Peru Surya Naa Illu India ) అనే సినిమా కథని మొదటగా జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పాడు.
కానీ ఆయన కథను రిజెక్ట్ చేయడంతో ఆ అల్లు అర్జున్ ను హీరోగా పెట్టి ఆ సినిమాను చేశాడు.ఈ మూవీ భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది.
ఇక దాంతో ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయానికి ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ అయితే ఉందనే చెప్పాలి.
కానీ అంతకు ముందు ఆయన తీసుకున్న నిర్ణయాలు తనని బోల్తా కొట్టించాయి.ఇక ఈ డెసిజన్ మాత్రం అతనికి ఫేవర్ గా రావడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.అయితే అల్లు అర్జున్ ఆ సినిమా కంటెంట్ మీద నమ్మకంతో చేశాడు.
కానీ మేకింగ్ పరంగా సినిమా అంత గొప్పగా తీయకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది…
ఇక ప్రతి ఒక్క హీరో కూడా ఒక కథని బాగా జడ్జ్ చేయగలిగాలి అలాగే దర్శకుడి దగ్గర ఆ కథను డీల్ చేసే దమ్ముందా లేదా అనేది కూడా ఒకటి పది సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.ఇక ఎందుకంటే ఒక్క సక్సెస్ వస్తే 10 సినిమాలా అవకాశం వస్తుంది.
అదే ఒక ఫెయిల్యూర్ వస్తే 20 సినిమాలా అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది.కాబట్టి ఇక్కడ సక్సెస్ అనేది చాలా కీలకం…
.