సాధారణంగా కొందరికి నుదుటి దగ్గర ఉండే జుట్టు అధికంగా రాలిపోతుంటుంది.పోషకాల లోపం, ఒత్తిడి, కాలుష్యం, కెమికల్స్ ఎక్కువగా ఉండే ప్రోడెక్ట్స్‌ను వాడటం ఇలా రకరకాల కారణాల వల్ల నుదుటి వద్ద జుట్టు ఊడిపోతుంటుంది.
దాంతో ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో అర్థంగాక తెగ సతమతమవుతుంటారు.అయితే అల్లంతో ఇప్పుడు చెప్పే విధంగా చెస్తే ఫోర్‌హెడ్ వద్ద రాలిపోతున్న జుట్టుకు సులభంగా అడ్డు కట్ట వేయవచ్చు.
మరియు రాలిపోయిన జుట్టును మళ్లీ మొలిపించవచ్చు.మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అల్లాన్ని ఎలా వాడాలో చూసేయండి.

ముందుగా పీల్ తీసిన అల్లాన్ని తీసుకుని మెత్తగా నూరి రసం తీసి పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల అల్లం రసం, ఒక స్పూన్ అలోవెర జెల్, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నుదుటిపై మరియు జుట్టు కుదుళ్లకు అప్లై చేసుకోవాలి.ఆపై అరగంట పాటు డ్రై అవ్వనిచ్చి గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.
ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.నుదుటి దగ్గర జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం స్టార్ట్ అవుతుంది.
అలాగే బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల అల్లం రసం, ఒక స్పూన్ వెల్లుల్లి రసం, ఒక స్పూన్ ఉల్లిపాయ రసం వేసుకుని కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దూది సాయంతో జుట్టు రాలుతున్న చోట పూయాలి.
అపై అర గంట లేదా గంట పాటు ఆరనిచ్చి అప్పుడు వాటర్‌తో వాష్ చేసుకోవాలి.ఇలా చేసినా నుదుటి దగ్గర జుట్టు ఊడిపోకుండా ఉంటుంది.మరియు ఊడిన జుట్టు కొత్తగా మొలుస్తుంది.

ఇక అల్లం చుండ్రును సమస్యను వదిలించడంలోనూ సహాయపడుతుంది.మూడు స్పూన్ల అల్లం రసానికి రెండు స్పూన్ల నువ్వుల నూనె, ఒక స్పూన్ నిమ్మ రసం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని తల మొత్తానికి పట్టించి.
గంట అనంతరం కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూతో హెడ్ బాత్ చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య పరార్ అవుతుంది.