న్యూస్ రౌండప్ టాప్ 20

1.రేవంత్ క్షమాపణ చెప్పాలి

Telugu Ap Volunteers, Chandrababu, Cm Kcr, Komativenkat, Ktr, Modhi, Pavan Kalya

ఉచిత విద్యుత్ పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, విద్యుత్ సౌదా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

2.వాలంటీర్ల పై చంద్రబాబు కామెంట్స్

వాలంటీర్లు పౌర సేవకు పరిమితం కాకుండా, రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే కుదరదు.వ్యక్తిగత సమాచారాన్ని వాలంటీర్లు సేకరించడం ద్రోహం దీనివల్ల ప్రమాదం పొంచి ఉందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.

3.  రైతులకు కేటీఆర్ ప్రశ్న

Telugu Ap Volunteers, Chandrababu, Cm Kcr, Komativenkat, Ktr, Modhi, Pavan Kalya

రైతుల ఉచిత విద్యుత్ కు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు .కేసీఆర్ నినాదం మూడు పంటలు కాంగ్రెస్ విధానం మూడు గంటలు బిజెపి విధానం మతం పేరిట మంటలు.మూడు పంటలు కావాలా, మూడు గంటలు కావాలా, మతం పేరిట మంటలు కావాలా అనేది రైతులు తేల్చుకోవాలని కేటీఆర్ కోరారు.

4.వైఎస్సార్ అవార్డులకు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు

దివంగత వైఎస్పేసార్ ప్రియ  లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డ్ లను ఏటా రెండుసార్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం హై పవర్ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.

5.బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించనున్న పురందరేశ్వరి

Telugu Ap Volunteers, Chandrababu, Cm Kcr, Komativenkat, Ktr, Modhi, Pavan Kalya

ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా దగ్గుపాటి పురందరేశ్వరి రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు.

6.కాంగ్రెస్ పై మంత్రి పువ్వాడ విమర్శలు

కాంగ్రెస్ కు పవర్ ఇస్తే రైతులకు కరెంట్ కట్ అంటూ తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన విమర్శలు చేశారు.

7.ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి ఏపీ క్యాబినెట్ ఆమోదం

Telugu Ap Volunteers, Chandrababu, Cm Kcr, Komativenkat, Ktr, Modhi, Pavan Kalya

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశమైంది.ఈ సందర్భంగా ఆర్ ఫైవ్ జోన్ లో ఇళ్ల నిర్మాణానికి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

8.తెలంగాణలో వర్షాలు

తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

నిన్న సాయంత్రం నుంచి హైదరాబాదులోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి.మరో ఐదు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

9.నేపాల్ ప్రధాని భార్య మృతి

Telugu Ap Volunteers, Chandrababu, Cm Kcr, Komativenkat, Ktr, Modhi, Pavan Kalya

నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ భార్య సీత దహల్ (69) ఈరోజు కన్నుమూశారు.

10.నేటి నుంచి ఏపీలో ఫీవర్ సర్వే

సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చేపట్టింది దీనిలో భాగంగానే నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే చేపట్టారు.

11.కేంద్ర క్యాబినెట్ భేటీ

Telugu Ap Volunteers, Chandrababu, Cm Kcr, Komativenkat, Ktr, Modhi, Pavan Kalya

ప్రధాని నరేంద్ర మోది అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది.ఈ సమావేశానికి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరు కాలేదు.

12.వీఆర్ఏలకు మంత్రివర్గ ఉప సంఘం భేటీ

తెలంగాణ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో వీఆర్ఏలకు మంత్రివర్గ ఉప సంఘం చర్చించనుంది.

13.భారత్ వెస్టిండీస్ మ్యాచ్

Telugu Ap Volunteers, Chandrababu, Cm Kcr, Komativenkat, Ktr, Modhi, Pavan Kalya

నేటి నుంచి భారత్ వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ జరగనుంది.రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

14.బీఆర్ఎస్ ఆందోళనలు

నేడు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది.ఉచిత విద్యుత్ అవసరం లేదన్న కాంగ్రెస్ ప్రకటనపై నిరసన తెలుపుతూ , కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనానికి పిలుపునిచ్చింది.

15.తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నా

Telugu Ap Volunteers, Chandrababu, Cm Kcr, Komativenkat, Ktr, Modhi, Pavan Kalya

నేడు తెలంగాణ వ్యాప్తంగా సబ్ స్టేషన్ ల ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు.రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

16.విద్యాసంస్థలు బంద్

నేడు తెలంగాణ వ్యాప్తంగా విద్య సంస్థల బంద్ కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

17.జగన్ పై దాడి కేసు

Telugu Ap Volunteers, Chandrababu, Cm Kcr, Komativenkat, Ktr, Modhi, Pavan Kalya

నేడు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో జగన్ పై దాడి కేసు విచారణ జరిగింది.నిందితుడు తరఫున ఎన్ఐఏ కోర్టు వాదనలు విననుంది.

18.మహిళా వాలంటీర్ పాదాలు కడిగిన ఎమ్మెల్యే

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమనిలో గ్రామస్థులకు ఉత్తమ సేవలు అందించిన దళిత గ్రామ వాలంటీర్ రజిత పాదాలను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కడిగారు.

19.పవన్ కళ్యాణ్ పై వైసీపీ లీగల్ సెల్ ఫిర్యాదు

Telugu Ap Volunteers, Chandrababu, Cm Kcr, Komativenkat, Ktr, Modhi, Pavan Kalya

వాలంటీర్లను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ సిపి లీగల్ సెల్ విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది.

20.కేటీఆర్ కు కోమటిరెడ్డి సవాల్

10 గంటల కరెంట్ ఇస్తున్నట్లు కేటీఆర్ చూపిస్తే సబ్ స్టేషన్ లోని రాజీనామా చేస్తానని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube