జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రాధాన్యం రోజు రోజుకు పెరుగుతోంది .ఎన్నికలకు ముందు టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడడం, ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించడంతో, ప్రభుత్వంలోనూ జనసేనకు మంచి ప్రాధాన్యమే దక్కింది .
ఒక ముఖ్యమంత్రిగా పవన్ కూ టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) ఊహించిన దానికంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.సినీ హీరోగా, జనసేన అధినేతగా, కాపు సామాజిక వర్గం తమ ఐకాన్ స్టార్ ఆయనను ఆరాధిస్తూ ఉండడం వంటివన్నీ పవన్ కు కలిసి వస్తున్నాయి.
పవన్ కు ఉన్న క్రేజ్ న పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేందుకు ఒకవైపు టిడిపి , మరోవైపు కేంద్ర బిజెపి పెద్దలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.పవన్ సహకారం ఉంటే తమకు తిరుగుండదని అటు టిడిపి, ఇటు బిజెపిలు భావిస్తున్నాయి.
ఈ విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు చురుగ్గా ఉన్నారు పవన్ కు అన్ని విషయాలను గౌరవం గుర్తింపు ఇస్తున్నారు.పవన్ ఏది అడిగినా చేస్తున్నారు.తనవారిని కాదనుకుని మరి పవన్ మాటకు ప్రాధాన్యం ఇస్తున్నారు.ఇటీవల వందరోజుల పాలన సమావేశంలోనూ ఎమ్మెల్యేలతో జరిగిన భేటీలోనూ ఇదేకూటమితో వచ్చే ఎన్నికలకు వెళ్దామని చంద్రబాబు ప్రకటించారంటే పవన్ వెంట ఉంటే తమ విజయానికి డొఖా ఉండదనే అంచనాతోనే బాబు ఉన్నారు.
ఇక పవన్ కి కూడా పెద్దగా పదవి కాంక్ష లేకపోవడం, అధికార దాహం లేకపోవడం, పాలనలో పెద్దగా జోక్యం చేసుకునే మనస్తత్వం కాకపోవడంతో, చంద్రబాబు ఆయనతో తమకు రానున్న రోజుల్లోనూ ఇబ్బంది ఉండదనే లెక్కల్లో ఉన్నారు.
కేంద్ర బిజెపి పెద్దలు పవన్ ను రాష్ట్రస్థాయి నాయకుడు గానే కాకుండా, జాతీయస్థాయిలో పవన్ క్రేజ్ ను ఉపయోగించుకోవాలని , వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి పవన్ ను దింపితే తమకు కలిసి వస్తుందనే అంచనాలో ఉన్నారు అందుకే పవన్ ను ఢిల్లీకి( Delhi ) పిలిపిస్తూ అన్ని విషయాల పైన చర్చిస్తున్నారు.పవన్ నిర్వహిస్తున్న శాఖలకు కేంద్ర బిజెపి పెద్దలు భారీగానే నిధులు కేటాయిస్తున్నారు.పవన్ కోరిన కోరికలను తీరుస్తున్నాడు.ప్రధాని నరేంద్ర మోది,( PM Narendra Modi ) హోమ్ మంత్రి అమిత్ షాలకు( Amit Shah ) అత్యంత ఇష్టుడిగా పవన్ మారారు.2027లో జమిలి ఎన్నికలు జరిగితే పవన్ కు ప్రాధాన్యం మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.మొన్నటి ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలను , రెండు పార్లమెంట్ స్థానాలను మాత్రమే పవన్ పొత్తులో భాగంగా తీసుకున్నారు.జమిలి ఎన్నికలు ( Jamili Elections ) వస్తే పవన్ అంతకు రెట్టింపు స్థాయిలో స్థానాలను డిమాండ్ చేసినా, చంద్రబాబు కూడా కాదు అనలేని పరిస్థితి ఉంది .ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ ను వదులుకోకుండా తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటేనే తమ అధికారానికి డొకా ఉండదనే అంచనాతో చంద్రబాబు ఉన్నారు.ఇక దాదాపు ఇడే అభిప్రాయంతో కేంద్ర బిజెపి పెద్దలు ఉండడంతో జమిలి ఎన్నికలు నాటికి పవన్ ప్రాధాన్యం మరింతగా పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.