చిగుళ్ళ నుండి రక్తస్రావం.వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని కలవర పెట్టే కామన్ సమస్య ఇది.
నోట్లో బ్యాక్టీరియా పేరుకుపోవడం, కఠినమైన బ్రష్‌లను ఉపయోగించడం, దంత పరిశుభ్రత లేకపోవడం, పలు రకాల మందుల వాడకం, ధూమపానం వంటి రకరకాల కారణాల వల్ల చిగుళ్ళ నుండి రక్తం వస్తుంటుంది.దాంతో ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ చిట్కాలను ట్రై చేస్తే చాలా ఈజీగా చిగుళ్ళ నుంచి వచ్చే బ్లీడింగ్‌కు చెక్ పెట్టొచ్చు.మరి ఆ చిట్కాలు ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
ముందుగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో ఆఫ్ టేబుల్ స్పూన్ జాజికాయ పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్‌ను నోట్లో వేసుకుని.
ఓ నాలుగైదు నిమిషాల పాటు పుక్కలించి ఉమ్మేయాలి.ఆపై నార్మల్ వాటర్‌తో మౌత్ వాష్ చేసుకోవాలి.
రోజుకు రెండు సార్లు ఈ విధంగా చేస్తే చిగుళ్ళ నుండి రక్తస్రావం జరగడం ఆగిపోతుంది.
అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని చిగుళ్లపై అప్లై చేసి మెల్లగా రెండు లేదా మూడు నిమిషాల పాటు రబ్ చేసుకుని.వాటర్‌తో నోటిని శుభ్రం చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.

చిగుళ్ల నుండి రక్తస్రావంకు అడ్డుకట్ట వేయడంలో సిట్రస్ ఫ్రూట్స్ గ్రేట్‌గా సహాయపడతాయి.అందుకే డైట్‌లో ఆరెంజ్, లెమన్, కివి, పైనాపిల్, బెర్రీస్, ఆమ్లా వంటి వాటిని చేర్చుకోవాలి.
ఇక లవంగం నూనెను ఉపయోగించి కూడా ఈ సమస్యను నివారించుకోవచ్చు.
లవంగం నూనెను రెండు వేళ్లతో తీసుకుని చిగుళ్లపై అప్లై చేసి.కాసేపు రబ్ చేయాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో మౌత్ వాష్ చేసుకోవాలి.రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఇలా చేస్తే చిగుళ్ల నుండి బ్లీడింగ్ అవ్వడం తగ్గిపోతుంది.