ప్రసిద్ధ శైవక్షేత్రమైన అచంట రామేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి మహోత్సవాలకు ఎంతో సుందరంగా ముస్తాబయింది.ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వైభవంగా ఉత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు.
ఇప్పటికే దేవాలయం లోపల, వేలుపల చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణ పనులు పూర్తయిపోయాయి.
ఈ సంవత్సరం సుమారు లక్ష మంది భక్తులు ఉత్సవానికి వస్తారని దేవాలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉత్సవాలు జరిగే ఐదు రోజుల పాటు భక్తులకు నిరంతరాయంగా అన్నదానం చేసేందుకు అన్నదాన సమాజా కమిటీ ఏర్పాటును పూర్తి చేసింది.వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగ కుండా చర్యలు చేపట్టినట్లు దేవస్థానం చైర్మన్ నెక్కంటి రామలింగేశ్వర రావు ఈవో ఆర్‌వీవీఎస్ రామచంద్రకుమార్ వెల్లడించారు.
ఈ నెల 16వ తేదీన వేకువ జామున నాలుగు గంటలకు రామేశ్వర స్వామి, పార్వతీ అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.ఇంకా చెప్పాలంటే 16 న స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, పట్టు వస్త్రాల సమర్పణ, స్వామివారికి లక్ష బిల్వర్చన, అమ్మవారికి కుంకుమార్చన, సినీ సంగీత విభవరి, నంది, గజాసర్ప వాహనాల పై స్వామి అమ్మవార్లకు గ్రామసభ ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు.17వ తేదీన స్వామి, అమ్మవార్లకు పూజ, అభిషేకాలు స్వామికి లక్ష బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన, నంది, రావణబ్రహ్మ, సింహా, గజా వాహనాలపై స్వామి అమ్మవార్ల గ్రామసభ జరుగానుంది.
18వ తేదీన స్వామి అమ్మవార్లకు పూజాభిషేకాలు, రథోత్సవం, విశ్వేశ్వరస్వామి కళ్యాణం, లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరగనుంది.19వ తేదీన స్వామి అమ్మవార్లకు పూజాభిషేకాలు,నంది, సింహ వాహనం పై గ్రామోత్సవం, జబర్దస్త్ బృందం ఆధ్వర్యంలో హాస్య ప్రదర్శన జరగనుంది.ఫిబ్రవరి 20వ తేదీన స్వామివారికి పుష్పోత్సవం, మహిళలకు కుంకుమ భరిణెల పంపిణీ జరగనుంది.
DEVOTIONAL