మన భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని( Uttarakhand ) దేవ భూమి అని పిలుస్తారు.ఈ రాష్ట్రంలోని ప్రతి కొండపై ఒకటి కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి.
ఒక్కో దేవాలయానికి ఒక్కొక్క కథ ఉంటుంది.ఉత్తరాఖండ్ లోని చమేలీ జిల్లాలో( Chameli District ) ఉర్గామ్ లోయలో ఉన్న ఒక దేవాలయానికి కూడా ఒక ప్రత్యేక కథ ఉంది.
ఈ దేవాలయ విశేషం ఏమిటంటే భక్తులు సంవత్సరంలో 364 రోజులు ఇక్కడ పూజించలేరు.ఆ ఒక్కరోజు మాత్రమే భక్తులు తమ దేవుడిని దర్శించుకుని పూజించగలరు.
ఈ దేవాలయం తలుపులు రక్షాబంధన్( Raksha Bandhan ) రోజున మాత్రమే తెరిచి ఉంటాయి.దేవతను ఆరాధించడంలో లింగ వివక్ష లేకపోయినా సోదర భావాన్ని జరుపుకునే రక్షాబంధన్ రోజున తెరవబడినందున వంశీ నారాయణ దేవాలయాన్ని( Vamshi Narayana Temple ) పూజించడానికి పురుషుల కంటే మహిళలు, వివాహం కానీ మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతారు.
ఈ రోజు మహిళలు, బాలికలు విష్ణువుకి రాఖీ కట్టి వారి భవిష్యత్తు, కుటుంబానికి ఆశీస్సులను కోరుకుంటారు.దీని వెనక ఒక పురాణం కథ ప్రకారం బలిచక్రవర్తిని( Bali Chakravarthy ) విష్ణువు వామన అవతారం తీసుకొని మూడు అడుగుల భూమిని కోరిన తర్వాత ఆ విష్ణువు( Maha Vishnu ) మహాబలి తలపై తన పాదాన్ని ఉంచి పాతాళానికి పంపాడు.కానీ మహాబలి తనతో పగలు రాత్రి ఉండమని విష్ణువు ను వేడుకుంటాడు.మహాబలి రాజు కోరికపై విష్ణువు పాతాళ లోకంలో అతని ద్వారా పాలకుడయ్యాడు.విష్ణువు పాతాళ లోకంలోనే ఉండిపోవడంతో లక్ష్మీదేవి( Lakshmi Devi ) కలత చెందింది.ఈ సమస్యకు పరిష్కారం చెప్పమని నారద ముని కోరగా మాత లక్ష్మికి శ్రావణమాసం పౌర్ణమి రోజు పాతాళ లోకానికి వెళ్లి మహాబలి రాజుకు రక్ష సూత్రం కట్టి విష్ణువును వెనక్కి పంపమని కోరమంటాడు.
మాత లక్ష్మి కి పాతాళ లోకానికి దారి తెలియక నారాద మునినీ తన వెంట రమ్మని కోరింది.
సంవత్సరంలో 364 రోజులు విష్ణువును పూజించే నారదుడు( Narada ) తనని విడిచిపెట్టి లక్ష్మితో వెళ్ళాడు.కానీ అతను లేకపోవడంతో కల్కోట్ గ్రామానికి చెందిన జాక్ పూజారి విష్ణువును పూజించాడు.అందుకే వంశీ నారాయణ దేవాలయంలో కల్కోత్ గ్రామానికి చెందిన వారు మాత్రమే పూజరులుగా ఉంటారని చెబుతున్నారు.
పాతాళనికి వెళ్లిన తర్వాత లక్ష్మీదేవి బలి చక్రవర్తికి రాఖీ కట్టి విష్ణువును విడిపించింది.ఆ రోజున విష్ణు తన నివాసానికి తిరిగి వచ్చాడు.అందుకే ఆయనకు విమోచన కలిగిన రోజు మాత్రమే ఈ దేవాలయాన్ని తెరుస్తారు.
DEVOTIONAL