ముఖ్యంగా చెప్పాలంటే పవిత్రమైన మాసాలలో కార్తీకమాసం( Kartika Masam ) ఒకటి అని ఖచ్చితంగా చెప్పవచ్చు.కార్తీకమాసంలోనీ పవిత్రమైన రోజులలో కార్తీక పౌర్ణమి( Karthika Pournami ) ఒకటి.
ఈ రోజు కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు.కార్తీక పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున పూజలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు.
ఈ పున్నమి రోజు తెల్లవారు జామునే నిద్రలేచి తలస్నానం చేయాలి.తులసి మొక్క దగ్గర దీపం పెట్టి పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి.
ఆ రోజు ఉపవాసం లేదా నక్తం ఉండాలి.చిన్న పిల్లలు, ముసలి వారు, అనారోగ్యంతో ఉన్నవారు, ఉద్యోగాల వల్ల వీలుకాని వారు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు.
తలస్నానం చేసి దీపారాధన చేస్తే చాలనీ పండితులు( Scholars ) చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం అంటే వండినవి, ఉప్పు, కారాలు, నూనెలు వేసినవి తినకూడదు.కేవలం పండ్లు మాత్రమే తీసుకోవాలి.ఇక ఏకభుక్తం అంటే ఉదయం భోజనం చేసి రాత్రి వరకు ఏమి తినకుండా ఉండాలి.
భుక్తం అంటే పగలంతా ఏమి తినకుండా ఉండి సాయంకాలం పూజ చేసుకున్నాక, నక్షత్ర దర్శనం చేసుకుని అప్పుడు మాత్రమే భోజనం చేయాలి.కార్తీక పౌర్ణమి రోజు తినే ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి, దుంపలు, ముల్లంగి వంటివి లేకుండా చూసుకోవాలి.
కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో సుచిగా వండుతున్న ఆహారాలను మాత్రమే తినాలి.ఈ రోజున మంచం మీద నిద్రపోకూడదు.కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దానం, దీప దానం, అన్నదానం వంటివి చేస్తే ఎంతో పుణ్యఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

అలాగే తేనె, పెరుగు, నెయ్యి, చెరుకు, ఆవులు, వెండి, దుస్తులు, భూమి, ఆవుపాలు వంటివి ధానం చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది.కార్తీక పౌర్ణమి రోజు వీలైనంతవరకు దేవుని సన్నిధానంలో ఉండాలి.ఈ కార్తీక పౌర్ణమి రోజు శివాలయం, విష్ణు దేవాలయం( Vishnu Temple ), గణపతి, లక్ష్మీదేవి దేవాలయాలను సందర్శించాలి.
అలాగే 365 వత్తులతో దీపం పెట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.