దేశంలోని ప్రముఖ దేవాలయాలకు వచ్చే ఆదాయాల గురించి తెలిస్తే...

దేశం మొత్తం మీద 5 లక్షలకు పైగా దేవాలయాలు ఉన్నాయని అంచనా.లక్షలాది మంది భక్తులు ప్రముఖ దేవాలయాలకు విరాళాలు అందిస్తుంటారు.

 Income Of Famous Temples In The Country. , Temples , Padmanabha Swamy Temple, T-TeluguStop.com

తద్వారా తమ కోరికలు నెరవేరుతాయని భావిస్తారు.దేశంలోని షిర్డీ సాయిబాబా ఆలయంతో పాటు అనేక దేవాలయాలకు ఏడాది పొడవునా వందల కోట్ల రూపాయలు విరాళాల రూపంలో అందుతుంటాయి.

ఇందులో నగదు మాత్రమే కాకుండా వజ్రాలు, బంగారం, వెండి ఆభరణాలు కూడా ఉంటాయి.హిందువుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఆలయాలలో ఒకటైన షిర్డీ సాయిబాబా దేవాలయం గత ఏడాది ఏకంగా 400 కోట్ల మొత్తాన్ని విరాళాలు రూపంలో అందుకుంది.

ఈస్థాయిలో విరాళాలు అందుకున్న దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పద్మనాభస్వామి దేవాలయం పద్మనాభస్వామి ఆలయాన్ని దేశంలోనే అత్యంత ధనిక దేవాలయంగా చెబుతుంటారు.

భారతదేశంలోని కేరళలోని తిరువనంతపురం నగరంలో ఈ ఆలయం ఉంది.ట్రావెన్‌కోర్ మాజీ రాజకుటుంబం ఈ ఆలయాన్ని పర్యవేక్షిస్తుంటుంది.ఆలయ సంపదలో వజ్రాలు, బంగారు ఆభరణాలు, బంగారు శిల్పాలు ఉన్నాయి.ఒక నివేదికలోని వివరాల ప్రకారం ఆలయంలోని 6 ఖజానాలలో మొత్తం 20 బిలియన్ డాలర్లు అంటే ఒక లక్షా 65 వేల కోట్లు ఉండవచ్చని అంచనా.గత ఏడాది ఈ ఆలయానికి విరాళాల రూపంలో రూ.833 కోట్లకు పైగానే ఆదాయం సమకూరిందని సమాచారం.తిరుపతి బాలాజీ దేవాలయం

Telugu Andhra Pradesh, Jammu, Kerala, Padmanabhaswamy, Temples, Tirumala, Vaishn

ధనిక దేవాలయాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి దేవస్థానం రెండవ స్థానంలో నిలిచింది.భారతదేశంలోని వైష్ణవ సంప్రదాయానికి చెందిన చెందిన తిరుమల ఆలయం విరాళాల పరంగా ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా గుర్తింపు పొందింది.ఈ ఆలయ నిర్మాణశైలి చూడదగినది.ఆలయానికి ప్రతి సంవత్సరం సుమారు 650 కోట్ల రూపాయల దానధర్మాల మొత్తంలో అందుతాయి.వైష్ణో దేవి ఆలయందేశంలోని అత్యంత సంపన్న దేవాలయాల జాబితాలో జమ్మూలోని వైష్ణో దేవి ఆలయం నాల్గవ స్థానంలో నలిచింది.ట్రావెల్ గైడ్ టూర్ మై ఇండియా తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఆలయానికి వచ్చే భక్తుల ద్వారా ప్రతి సంవత్సరం సుమారు రూ.500 కోట్లు అందుతాయి.షిర్డీ సాయిబాబా దేవాలయంఈ జాబితాలో షిర్డీ సాయిబాబా ఆలయం ఐదవ స్థానంలో నిలిచింది.

అందిన నివేదికల ప్రకారం ఆలయంలో 380 కిలోల బంగారం, 4,428 కిలోల వెండి ఉన్నాయి.ఆలయానికి చెందిన బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.1800 కోట్లు ఉన్నాయి.2017లో శ్రీ రామ నవమి సందర్భంగా ఓ భక్తుడు 12 కిలోల వరకు బంగారాన్ని విరాళంగా సమర్పించాడు.2021 వరకు ఆలయానికి ప్రతి సంవత్సరం సుమారు రూ.350 కోట్ల విరాళాలు అందేవి.ఇది 2022 సంవత్సరం చివరి నాటికి రూ.400 కోట్లకు పెరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube