అతనిలో దృష్టి లోపమున్నా క్రికెట్‌లో రారాజు... రాజవంశస్థుడైనా సాధారణ యువతినే పెళ్లాడి...

మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఒకనాటి భారతీయ క్రికెట్ ఆటగాడు.భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్.

 He Is The King Of Cricket ,mansoor Ali Khan Pataudi ,tiger Pataudi ,cricket,mans-TeluguStop.com

పటౌడీ వంశంలో తొమ్మిదవ నవాబ్.టైగర్ పటౌడీ అని కూడా పేరొందిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ భారతదేశానికి చెందిన అత్యంత తెలివైన కెప్టెన్లలో ఒకరు.

తన 21 ఏళ్ల వయసులో పటౌడీ అద్వితీయ రికార్డు నెలకొల్పాడు.భారత టెస్టు క్రికెట్ జట్టుకు అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా నిలిచాడు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జనవరి 5, 1941న జన్మించిన ఈయన మన్సూర్ అలీ… ఇఫ్తీకర్ అలీ ఖాన్, సాజిదా సుల్తాన్‌ల కుమారుడు.మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ తొలుత అలీఘర్‌లోని ఏఎంయూ మింటో సర్కిల్ స్కూల్‌లో, ఆ తర్వాత డెహ్రాడూన్‌లోని వెల్హామ్ బాలుర పాఠశాలలో, ఆపై హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని లాకర్స్ పార్క్ స్కూల్ తరువాత వించెస్టర్ కాలేజీలో చదువుకున్నాడు.

ప్రమాదంలో కన్ను కోల్పోయాడు

మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఒక ప్రమాదంలో తన ఒక కన్ను కోల్పోయాడు.అయితే ఈ ప్రమాదం అతనిలోని ప్రతిభను దూరం చేయలేకపోయింది.మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కేవలం ఒక కన్నుతో ప్రపంచాన్నే జయించాడు.1952లో తండ్రి మరణానంతరం మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ తొమ్మిదవ నవాబుగా సింహాసనాన్ని అధిష్టించాడు.క్రికెట్‌పై మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మక్కువ అపారమైనది.1961లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఇంగ్లండ్‌పై ఆటతో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.1962లో భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు.మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ 1961 మరియు 75 మధ్య భారతదేశం తరపున 46 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.1968లో న్యూజిలాండ్‌పై విదేశాల్లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది.మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ తన అంతర్జాతీయ కెరీర్ మొత్తాన్ని ఒంటి కన్నుతోనే అద్భుతంగా ఆడాడు.

Telugu Cricket, Mansoorali, Sajida Sultan, Sharmila Tagore, Tiger Pataudi-Latest

జీవిత భాగస్వామిగా షర్మిలా ఠాగూర్‌

ఆ రోజుల్లో మన్సూర్ అలీపై లెక్కలేనంత మంది ఆడపిల్లలు మక్కువ పెంచుకున్నారు.కానీ మన్సూర్ దృష్టి ఓ బెంగాలీ యువతిపై పడింది.బెంగాల్‌కు చెందిన షర్మిలను చూసినే వెంటనే మన్సూర్‌ మనసు మారిపోయిందని అంటుంటారు.ప్రేమ పక్షులుగా మారిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ- షర్మిలా ఠాగూర్ కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత డిసెంబర్ 27, 1968న వివాహం చేసుకున్నారు.

షర్మిల కోరిక మేరకు పటౌడీ వరుసగా మూడు సిక్సర్లు బాదాడు.జనం వీరి సంబంధం గురించి రకరకాలుగా వ్యాఖ్యానించారు.వారి బంధం ఎక్కువకాల నిలవదని చాలా మంధి ఆరోపించారు.అయితే అలా జరగలేదు.

ఈ దంపతులు 47 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని గడిపారు.మన్సూర్ అలీ 2011లో కన్నుమూశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube