వెబ్ సిరీస్ లకు సెన్సార్ తప్పనిసరి చేయాలి... సీనియర్ నటి గౌతమి కామెంట్స్ వైరల్!

ప్రస్తుతం ఏదైనా ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటే తప్పనిసరిగా సెన్సార్ సభ్యుల పర్మిషన్ తీసుకోవాలి.సెన్సార్ సభ్యులు సినిమాని వీక్షించిన అనంతరం అందులో అభ్యంతరకర సన్నివేశాలు, ఏవైనా హింసాత్మక సన్నివేశాలు కనుక ఉంటే వాటిని తొలగిస్తూ ఉంటారు.

 Censor Should Be Mandatory For Web Series Senior Actress Gautami Details, Censor-TeluguStop.com

అయితే వెబ్ సిరీస్ లకు మాత్రం సెన్సార్ లేకపోవడంతో హింసాత్మకమైన సన్నివేశాలు ఉంటున్నాయి.అలాగే ఎన్నో అభ్యంతరకర సన్నివేశాలు కూడా వెబ్ సిరీస్ లో ప్రసారమవుతున్నాయి.

ఇక ప్రస్తుతం ఓటీటీల ఆదరణ పెరిగిన తర్వాత సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది.

ఈ క్రమంలోనే ఎన్నో వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నాయి.

అయితే వెబ్ సిరీస్ లకు కూడా సెన్సార్ ఉంటేనే మంచిదని ఎంతోమంది వారి అభిప్రాయాలను తెలియజేశారు.ఈ క్రమంలోనే సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి గౌతమి కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా కూడా పనిచేస్తున్నారు.

అయితే తాజాగా ఈమె వెబ్ సిరీస్ లకు సెన్సార్ ఉండాలి అంటూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ.వెబ్ సిరీస్ లకు కూడా సెన్సార్ అవసరమని తెలియజేశారు అయితే ఇది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయం అని ఈమె తెలియజేశారు.ఇక ఈమె కూడా నటిగా ఎన్నో సినిమాలలో నటించారు.

అలాగే బుల్లితెర కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.ఇక ప్రస్తుతం గౌతమి వెబ్ సిరీస్లలో కూడా సందడి చేయడానికి సిద్ధమైంది.

ప్రస్తుతం ఈమె స్టోరీ ఆఫ్ థింగ్స్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.ఇక ఈ వెబ్ సిరీస్ శుక్రవారం నుంచి సోనీ లీవ్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ప్రసారమవుతుంది.

ప్రస్తుతం గౌతమి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube