చేపలను తినమని వైద్యులు అదేపనిగా చెప్పడానికి గల కారణాలు ఇవే..!

నాన్ వెజ్ ప్రియుల్లో కొంతమంది చేపలను తినడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు.సాధారణంగా చేపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని చాలామంది ప్రజలకు తెలుసు.

 These Are The Reasons Why Doctors Tell Us To Eat Fish ,fish, Health, Health Tip-TeluguStop.com

అంతేకాకుండా చేపలు తినడం వల్ల మంచి పౌష్టికా ఆహారం తీసుకున్నట్లు అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా సాల్మన్,( Salmon Fish ) ట్రౌట్, మాకెరెల్, సార్డినెస్ మధ్య చేపలు ఎక్కువ కొవ్వు పదార్థాలను కలిగి ఉంటాయి.

వీటిని తింటే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోకి త్వరగా చేరుతాయి.

Telugu Brain, Eyes, Tips, Heart Attack, Omega, Salmon Fish-Telugu Health Tips

చేపలు ఎందుకు తినాలో, వాటిని తింటే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు( Omega-3 ) మనిషి శరీర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి.ఇవి చాలా తక్కువ ఆహార పదార్థాలలో లభిస్తాయి.

ఇవి మానవ మెదడు, కంటిచూపులు మెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి.మనిషి మెదడులో ఎక్కువ భాగం బాల్యంలోనే అభివృద్ధి చెందుతుంది.

వృద్ధాప్యం చేరువుతున్న కొద్ది దాని పనితీరు బలహీనపడుతూ వస్తుంది.అలాగే పిల్లలు ముసలివారే ముఖ్యంగా చేపలను ఎక్కువగా తినాలి.

Telugu Brain, Eyes, Tips, Heart Attack, Omega, Salmon Fish-Telugu Health Tips

ఇందులో పోషకాలు మెదడుకు ఎంతగానో ఉపయోగపడతాయి.చేపలలో ఉండే పోషకాహారం మెదడు శక్తిని పనితీరును మెరుగుపరుస్తుంది.చేపలలో మన కండరాలకు బలాన్ని ఇచ్చే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.అలాగే వ్యాయామం చేసే వారికి ప్రోటీన్లు ఎంతో అవసరం.చేపల్లో ఉండే ప్రోటీన్ ఎంతో బలాన్ని ఇస్తుంది.ఆధునిక కాలంలో కంప్యూటర్ స్క్రీన్ లను, మొబైల్లను చూసేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది.

ఇది కంటిచూపు పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.చేపలు తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.

గుండె కండరాలకు చేపలు ఎంతగానో మేలు చేస్తాయి.

Telugu Brain, Eyes, Tips, Heart Attack, Omega, Salmon Fish-Telugu Health Tips

ఆ కండరాలు బలహీనమైనప్పుడు గుండెపోటు( Heart attack ) వచ్చే ప్రమాదం పెరుగుతుంది.గుండెకు మేలు చేసే పిఎఫ్ ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చేపలలో ఎక్కువగా ఉన్నాయి.ఇవి గుండె కండరాలకు బలాన్ని ఇస్తాయి.

అంతేకాకుండా జుట్టు పెరుగుదలకు కూడా చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి.ఇవి జుట్టు మెరిసేలా, దృఢంగా ఉండేలా చేస్తాయి.

అందుకోసమే వైద్యులు అదేపనిగా చేపలను వారానికి రెండుసార్లు అయినా తినమని చెబుతూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube