ముఖ్యంగా చెప్పాలంటే వాస్తు( Vastu ) జీవితం పై చాలా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.వాస్తు ప్రకారం నిర్మించుకున్న ఇంట్లో అన్ని వస్తువులు వాస్తు ప్రకారమే ఉంచితే జీవితం కూడా ఆనందంగా, సంతోషంగా, హాయిగా ఉంటుంది.
కొన్ని పొరపాట్లు తెలియక చేసే తప్పుల వల్ల వాస్తు శాస్త్రం ప్రకారం విపరీతమైన ప్రభావం పడుతుంది.ఆ తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే వాస్తు శాస్త్రం( Vastu shastra ) ప్రకారం చెత్త డబ్బాలను ఇష్టం వచ్చిన ప్రదేశంలో అస్సలు ఉంచకూడదు.అలా చేయడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అందుకే ఇంట్లోనీ చెత్తను పారబోసేందుకు వాడే చెత్తబుట్ట( Dustbin )ను సరైన దిశలోనే ఉంచాలి.ఇంకా చెప్పాలంటే పిల్లలు చదువుకునే గదిలో చెత్త డబ్బాలను అస్సలు ఉంచకూడదు.
అలా ఉంచితే పిల్లలకు చదువుపై ఆసక్తి తగ్గిపోతుంది.అలాగే ఇంట్లో సరైన దిశలో చెత్త కుండీని ఉంచకపోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మొదలవుతాయి.
వ్యాపారస్తులు అయితే లాభాల స్థానంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది.చెల్లింపులు కూడా నిలిచిపోవచ్చు.డస్ట్ బిన్ తూర్పు ఆగ్నేయం, దక్షిణ నైరుతి మరియు పశ్చిమ వాయువ్య దిశలలో ఉంటే సానుకూల శక్తి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఈశాన్య దిశలో డస్ట్ బిన్ ఉంచడం వల్ల మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇంకా చెప్పాలంటే సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.అలాగే చెత్త ను తూర్పు దిశలో( East direction ) ఉంచడం వల్ల వ్యక్తిగత ప్రాముఖ్యత క్రమంగా తగ్గిపోతుంది.

సమాజంలో కీర్తి ప్రతిష్టలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.కుటుంబ సభ్యులతో పాటు ఇరుగుపొరుగు వారి దృష్టిలో గౌరవ, మర్యాదలు కూడా తగ్గిపోతాయి.అలాగే వ్యాపారం( Business )లో భారీ నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇంకా చెప్పాలంటే డస్ట్ బిన్ ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల సంపద ఇంటికి చేరకుండా అడ్డుకుంటుంది.
అలాంటి ఇంట్లో నివసించే వారు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఏదైనా మంచి జరగబోతుంటే అవకాశాన్ని అడ్డుకోవడానికి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూ ఉంటుంది.