గంగాజలం ఇంట్లో ఉన్నప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం గంగా నదిని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.ఈ క్రమంలోనే గంగాజలాన్ని కూడా అంతే పవిత్రంగా భావించి పవిత్రమైన జలంగా పరిగణిస్తారు.

 Do Not Make These Mistakes Even Ganga Water Is At Home,  Ganga Water, Mistakes,-TeluguStop.com

ఈ క్రమంలోనే కొందరు ఏదైనా శుభ కార్యాలు జరిగినప్పుడు తప్పకుండా గంగా జలం ఇంటిలో చల్లి శుభకార్యాలను పాటిస్తారు.మత విశ్వాసాల ప్రకారం గంగాజలం మనం చేసిన పాపాల నుంచి మనకు మోక్షం లభిస్తుందని భావించడంతో ప్రతి ఒక్కరూ గంగాజలంతో స్నానమాచరిస్తారు.

ఇంతటి పవిత్రమైన గంగా జలం మన ఇంటిలో ఉన్నప్పుడు ఎంతో నియమ నిష్టలతో ఉండాలని ఎలాంటి పొరపాట్లు చేయకూడదని పండితులు చెబుతున్నారు.

ఎంతో పవిత్రమైన గంగా జలం మన ఇంటిలో ఉన్నప్పుడు మనం ఆ గంగాజలాన్ని ఎంతో పవిత్రంగా భావించాలి.

అదే విధంగా ఈ గంగాజలాన్ని దగ్గరగా ఎలాంటి నీచు పదార్థాలను పెట్టకూడదు.ముఖ్యంగా వంటగదికి గంగాజలాన్ని చాలా దూరంగా ఉంచాలి.అదేవిధంగా గంగాజలం పెట్టే చోట చీకటిగా ఉండకూడదు.ఎంతో పవిత్రమైన ప్రదేశంలో మాత్రమే గంగాజలాన్ని ఉంచాలి.

చాలామంది గంగాజలాన్ని ప్లాస్టిక్ బాటిల్ లో నింపుతూ ఉంటారు.ఇలా పొరపాటున కూడా చేయకూడదు.

Telugu Clean Place, Copper Vessel, Darkness, Ganga, Hindu, Worship-Telugu Bhakth

గంగాజలం ఎల్లప్పుడూ కూడా రాగి, ఇత్తడి, కంచు లేదా వెండి చెంబులో మాత్రమే ఉండాలి.ఇలా ఉన్నప్పుడే గంగాజలం ఎంతో పవిత్రతను కలిగి ఉంటుంది.ఇక గంగాజలాన్ని తాకేటప్పుడు శుభ్రంగా స్నానం చేసినప్పుడు మాత్రమే గంగాజలాన్ని తాకాలి.గంగాజలం పెట్టే చోట ఎంతో పవిత్రమైనదిగా ఉండటమే కాకుండా.గంగాజలం ముట్టుకున్నప్పుడు ఎంతో శుచి శుభ్రతను పాటించాలి అప్పుడే గంగా జలానికి పవిత్రత ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube