సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో చేసే ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది అని ఎవరు చెప్పలేరు.అదేవిధంగా ఇక హీరోలు చేసే ప్రతి సినిమా ఫ్లాప్ అవుతుందని కూడా ఎవరూ ఊహించలేరు.
అంతా ప్రేక్షకుడి చేతుల్లో ఉంటుంది ప్రేక్షకుడికి నచ్చేలా కథ సినిమా ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం చివరికి రెండున్నర గంటలపాటు ప్రేక్షకుడికి బోర్ కొట్టేస్తే చివరికి సినిమా ప్లాప్ అవడం జరుగుతుంటుంది.అంతేకాదు ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరో హీరో చేయటం ఇక సూపర్ హిట్ అందుకోవడం సర్వ సాధారణమే అన్న విషయం తెలిసిందే.
అయితే కొన్ని సినిమాల విషయంలో మాత్రమే ఇలాంటి విషయాలు ప్రేక్షకులకు తెలుస్తూ ఉంటాయి.కానీ కొన్ని సినిమాల విషయంలో ఇలాంటివి జరిగాయి అన్న విషయం ప్రేక్షకులకు అస్సలు తెలియదు అని చెప్పాలి.
ఇక ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ గా నిలిచిన ఒక సినిమా విషయంలో మాత్రం అచ్చంగా ఇలాంటిదే జరిగిందట.ఆ సినిమా ఏదో కాదు హనుమాన్ జంక్షన్.
ఒకప్పటి స్టార్ హీరోలు హనుమాన్ జంక్షన్ సినిమా ను వదిలేసుకున్నారట.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ మూవీ లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా మోహన్ రాజ తెరకెక్కిస్తున్నారు.
అప్పట్లో అర్జున్, జగపతిబాబు హీరోగా వచ్చిన హనుమాన్ జంక్షన్ సినిమాను కూడా మోహన్ రాజా తెరకెక్కించారన్న విషయం తెలిసిందే.ఇకపోతే ఇటీవల గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో భాగంగా మోహన్ రాజ హనుమాన్ జంక్షన్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.ముందుగా ఈ సినిమాలో అర్జున్ జగపతిబాబు హీరోలుగా ఎంపిక చేయలేదట.
మోహన్ బాబు రాజశేఖర్ ల తో సినిమా చేయాలని అనుకున్నాడట.వాళ్ళిద్దరికీ అడ్వాన్సులు కూడా ఇచ్చేశాడట.అయితే ఇద్దరు స్టార్ హీరోలు కావడంతో వారి అభిమానులను మెప్పించగలనా లేదా అనే అనుమానం వచ్చింది.
ఈ విషయం తన తండ్రికి చెప్పగా.తన తండ్రి జగపతి బాబు అర్జున్ లను ఎంపిక చేశారని మోహన్ రాజ చెప్పుకొచ్చారు.
అయితే హనుమాన్ జంక్షన్ సినిమాకు మోహన్ రాజు తండ్రి మోహన్ ఎడిటర్ గా పనిచేశారు అనే విషయం తెలిసిందే.