అన్నం,బియ్యం పట్ల ఉన్న అపోహలు - వాస్తవాలు

మన దేశంలో చాలా మంది అన్నమును తింటారు.అన్నంలో కూరలను,పెరుగును కలుపుకొని తింటారు.

 Health Myths And Facts On White Rice-TeluguStop.com

అయితే అన్నం పట్ల ఎన్నో అపోహలు ఉన్నాయి.అన్నం ప్రతి రోజు తినటం వలన శరీరంలో కొవ్వు చేరుతుందా? మధుమేహం ఉన్న వారు ఎక్కువగా అన్నాన్ని తినకూడదా? ఎలా ఎన్నో అపోహలు ఉన్నాయి.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

బియ్యంలో ఎక్కువగా గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంటుందని అనుకుంటారు.కానీ బియ్యంలో గ్లూటెన్ ఉండదు.ఈ ప్రోటీన్ గోధుమలు, బార్లీ, ఓట్స్ మొదలైన వాటిలో ఉంటుంది.

ఒకవేళ గ్లూటెన్ ఉంటే కనుక ఆ పదార్ధానికి నీరు తగిలినప్పుడు సాగుతుంది.కాబట్టి అన్నాన్ని హ్యాపీగా తినవచ్చు.

అన్నం తినటం వలన ఎలాంటి కొవ్వు శరీరంలోకి చేరదు.అయితే అన్నంలో కలుపుకొని తినే ఫ్రై కూరలు,ఫాస్ట్ ఫుడ్స్ ,వ్యాయామం చేయకపోవటం వంటి కారణంగా శరీరంలో కొవ్వు చేరుతుంది.అంతే కానీ అన్నం తినటం వలన శరీరంలో కొవ్వు చేరదు.

బియ్యంలో కేవలం పిండిపదార్ధాలు మాత్రమే ఉంటాయని అసలు ప్రోటీన్స్ ఉండవని చాలా మంది భావిస్తారు.

అయితే ఒక కప్పు బియ్యంలో 3 నుంచి 4 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.ఇవి శరీర నిర్మాణానికి సహాయపడతాయి.

చాలా మంది బియ్యంలో ఉప్పు ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు.అయితే కొద్దీ మొత్తంలో సోడియం ఉంటుంది.కానీ అది పెద్ద లెక్కలోకి రాదు.

రాత్రి సమయంలో అన్నం తింటే ఎక్కువ బరువు పెరుగుతామని చాలా మంది తినటం మానేస్తారు.

అయితే రాత్రి సమయంలో అన్నం తినటం వలన లెప్టిన్ అనే హార్మోన్ విడుదల అయ్యి శరీరంలో శక్తిని బాగా ఖర్చు చేస్తుంది.దాంతో శరీరంలో కొవ్వు కూడా చేరదు.అందువల్ల రాత్రి సమయంలో అన్నం తిన్న నష్టం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube