చిన్న వయస్సులోనే మృతి చెందిన కన్నడ ​హీరోహీరోయిన్లు వీళ్లే?

జీవితం చాలా చిన్నది.ఎప్పుడు ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.

ఎంతో ఆరోగ్యంగా, ఫిట్ గా ఉన్న పునీత్ రాజ్ కుమార్ గుండె సంబంధిత సమస్యల వల్ల మృతి చెందిన సంగతి తెలిసిందే.టాలీవుడ్ సినీ ప్రముఖులు బాలకృష్ణ, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ పునీత్ అంతిమ సంస్కారాల్లో పాల్గొననున్నారు.

పునీత్ పార్థికదేహాన్ని చూసి బాలకృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు.కన్నడ సినీ పరిశ్రమలో పునీత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు చిన్న వయస్సులోనే మృతి చెందారు.కన్నడ నటులు అనిల్, ఉదయ్ మాస్తిగుడి సినిమా క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్ సమయంలో చనిపోయారు.2016 సంవత్సరం నవంబర్ నెలలో ఈ ఘటన చోటు చేసుకుంది.1994 సంవత్సరంలో మిస్ బెంగళూరు టైటిల్ ను గెలుచుకున్న నివేదిత 1998 సంవత్సరంలో భవనంపై నుంచి కొందపడి మృతి చెందారు.కన్నడలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో మంజుల ఒకరు కాగా ఒక ప్రమాదంలో మంజుల మృతి చెందారు.

చనిపోయిన సమయంలో మంజుల వయస్సు కేవలం 35 సంవత్సరాలు కావడం గమనార్హం.కన్నడలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కల్పన అప్పులు, ఆరోగ్య సమస్యల వల్ల నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు.కన్నడలో ఛార్మింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సునీల్ కారు ప్రమాదంలో 30 సంవత్సరాల వయస్సులో చనిపోయారు.

Advertisement

ప్రముఖ నటి సౌందర్య 31 సంవత్సరాల వయస్సులో విమాన ప్రమాదంలో మృతి చెందారు.కన్నడ, తమిళ, మలయాళ సినిమాలలో ఈమె నటించారు.కన్నడలో డైనమిక్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకున్న శంకర్ నాగ్ 1990 సంవత్సరం సెప్టెంబర్ నెలలో మృతి చెందారు.

కన్నడ నటుడు విజయ్ సంచారి, చిరంజీవి సర్జా వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే.పునీత్ రాజ్ కుమార్ మృతితో అభిమానులు ఎంతో బాధ పడుతుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు