పాకిస్థాన్ జైల్లో మగ్గిపోతున్న 199 మంది భారతీయ మత్స్యకారులను( Indian Fisherman ) ఈవారం చివరలో విడుదల చేయనున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం( Pakistan Govt ) అధికారికంగా ప్రకటించింది.కాగా కొన్నాళ్ల క్రితం తమ దేశ జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారనే నెపంతో 199 మంది భారతీయ మత్స్యకారులను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
వారిని అరెస్ట్ చేసిన తరువాత ఇక్కడ లాంధీ జైలులో ఉంచారు.అయితే కొన్ని షరతుల మీద ఆ 199 మంది మత్స్యకారులను శుక్రవారం విడుదల చేసి స్వదేశానికి పంపించే పనిలో పడింది పాక్.
ఈ విషయమై సంబంధిత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సమాచారం ఇచ్చినట్టు సింధ్ ఉన్నత పోలీసు అధికారి కాజీ నజీర్ తాజాగా తెలిపారు.ఈ క్రమంలో ఈ మత్స్యకారులను లాహోర్‌లోని ( Lahore ) వాఘా సరిహద్దులో భారత అధికారులకు అప్పగించనున్నట్లు కూడా చెప్పుకొచ్చారు.మత్స్యకారులతో స్వదేశానికి తరలించాల్సిన భారతీయ పౌర ఖైదీ జుల్ఫికర్ అనారోగ్యం కారణంగా శనివారం కరాచీలోని ఆసుపత్రిలో మరణించడంతో పాకిస్తాన్ అధికారులు సహృద్భావంతో వారిని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయమై వెల్ఫేర్ ట్రస్ట్ అధికారి ఒకరు మాట్లాడుతూ… లాంధీ, మలిర్ జైళ్లలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, జైళ్లలోని ఆయా పరిస్థితుల కారణంగానే ఆరోగ్యం విషమించి జుల్ఫికర్ మరణించాడని చెప్పుకు రావడం కొసమెరుపు.పాకిస్తాన్ ఇండియా పీపుల్స్ ఫోరమ్ ఫర్ పీస్ అండ్ డెమోక్రసీ ప్రకారం, ప్రస్తుతం 631 మంది భారతీయ మత్స్యకారులు, ఒక పౌర ఖైదీ జైలు శిక్షను పూర్తి చేసినప్పటికీ కరాచీలోని లాంధీ, మలిర్ జైళ్లలో ఉన్నారు.ఇకపోతే గతంలో కూడా కొంతమంది భారతీయ పౌర ఖైదీలు అక్కడ అనారోగ్యంతో ఆసుపత్రుల్లో మరణించారని జైలు అధికారులు చెబుతున్నారు.