ప్రొద్దుటూరులో పాదయాత్రలో నారా లోకేష్ పై దాడి..!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ “యువగళం” ( Yuva Galam )పాదయాత్ర కడప జిల్లాలో సాగుతున్న సంగతి తెలిసిందే.కడప జిల్లా ప్రొద్దుటూరులో నేడు లోకేష్ ( Nara Lokesh )పాదయాత్ర జరుగుతూ ఉండగా ఓ ఇద్దరు వ్యక్తులు  లోకేష్ పై కోడిగుడ్డు విసరడం జరిగింది.

 Attack On Nara Lokesh During Padayatra In Proddatur Tdp, Nara Lokesh , Ap Politi-TeluguStop.com

వెంటనే అప్రమత్తమైన భద్రత సిబ్బంది.మరియు క్యాడర్ ఆ వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

దీంతో అక్కడే ఆగి లోకేష్ కాసేపు నిరసన తెలుపటంతో… స్థానికంగా కొంత ఉద్రిక్తత నెలకొంది.వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ముందస్తు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో లోకేష్ సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఈ పరిణామంతో కడప టీడీపీ కార్యకర్తలు( TDP ) కోపంతో ఊగిపోయారు.కోడిగుడ్లు విసిరిన వ్యక్తులను గుర్తించి వెంబడించి పట్టుకుని వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.పోలీసులు ఆ యువకులను పోలీస్ స్టేషన్ కి తరలించారు.

అయితే ఆ ఇద్దరు యువకులు తాము దాడి చేయలేదని లోకేష్ పాదయాత్ర చూడటానికి వచ్చినట్లు వాదిస్తున్నారు.ప్రస్తుతానికి అయితే ఇది ఆకతాయిలు చేసిన పనిగానే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube