అల్లూరి జిల్లాలో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది.రంపచోడవరం మండలం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో అసిస్టెంట్ రేంజ్ ఆఫీసర్ డి.
లలిత కుమారి లంచం తీసుకుంటూ పట్టుబడింది.టేకు చెట్లు తీసుకుని వెళ్లేందుకు అనుమతి కోసం రూ.50 వేలు లంచం డిమాండ్ చేసింది.ఈ క్రమంలోనే లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు లలితకుమారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
అనంతరం ఫారెస్ట్ రేంజ కార్యాలయంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.