టాలీవుడ్ యంగ్ హీరో,గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR ) మే 21 తేదీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోబోతున్నారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసే పనిలో అభిమానులు నిమగ్నమయ్యారు.
ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరో పుట్టినరోజు కనుక వస్తే ఆ హీరో సినీ కెరియర్లో బ్లాక్ బస్టర్ సినిమాలను విడుదల చేయడం ట్రెండ్ అవుతుంది.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి ( Rajamouli ) ఎన్టీఆర్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న సింహాద్రి సినిమా( Simhadri Movie )ని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.
ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ కూడా విడుదల చేశారు.మే 20వ తేదీ ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా 4k వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇక ఎన్టీఆర్ కొత్త సినిమా విడుదల సమయంలో కూడా చేయని రేంజ్ లో ఈ సినిమా రీరిలీజ్ సమయంలో సెలబ్రేషన్స్ జరగాలని ఎన్టీఆర్ అభిమానులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇకపోతే సింహాద్రి సినిమా రీ రిలీజ్ కోసం వరల్డ్స్ లార్జెస్ట్ IMAX స్క్రీన్ నే బుక్ చేశారు.ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ప్రపంచంలోనే అతిపెద్ద IMAX స్క్రీన్ ఉంది, ఈ స్క్రీన్ లో సింహాద్రి సినిమా స్పెషల్ షో పడుతుందని పోస్టర్ ద్వారా వెల్లడించారు.
ఎన్టీఆర్ పుట్టినరోజు అయిన మే 20వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ షో ప్రసారం కానుందని అందుకు టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా వెల్లడిస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు.ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా ఒక హీరో సినిమాని తిరిగి విడుదల చేస్తూ అది పెద్ద స్క్రీన్ పై ఈ చిత్రాన్ని విడుదల చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
దీన్ని బట్టి చూస్తుంటే ఎన్టీఆర్ కు ఏ స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉందో తెలిసిపోతుంది.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఈయన కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.