అందుకే నా సినిమా విడుదల చేయట్లేదంటున్న యంగ్ హీరో... ఏమైందంటే..

ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఈ కరోనా వైరస్ మహమ్మారి ఒక్కసారిగా మానవ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.ఈ కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకి దేశంలోని పారిశ్రామిక మరియు ఇతర రంగాలు కూడా బాగానే దెబ్బతిన్నాయి.

 Young Hero Vishwak Sen Clarity About Paagal Movie Release Stop, Young Hero, Vish-TeluguStop.com

అయితే ఇందులో సినిమా రంగం కూడా ఒకటే.కాగా ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్లలో మూసివేయడంతో పలు చిత్రాలు విడుదల ఆగిపోయింది.

అయితే తెలుగులో ఫలక్నామా దాస్ యంగ్ హీరో “విశ్వక్ సేన్” హీరోగా నటించిన “పాగల్” చిత్రం ఈ నెల ఒకటో తారీకున విడుదల కావాల్సి ఉంది.కానీ పలు అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అనుకున్న తేదీకి విడుదల చేయలేక పోయారు.

దీంతో తాజాగా ఈ చిత్రంలో హీరోగా నటించిన విశ్వక్ సేన్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ తద్వారా ఈ విషయంపై స్పందించాడు.ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ పరిస్థితుల కారణం వల్లే తాము “పాగల్” చిత్రాన్ని విడుదల చేయడం లేదని స్పష్టం చేశాడు.

అలాగే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కలకలం సృష్టిస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరు బయటకు వెళ్లే సమయంలో తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించాడు.అంతేకాకుండా అత్యవసర పరిస్థితులలో తప్ప ఇతర సమయాల్లో అనవసరంగా బయటకు రావద్దని కూడా కోరాడు.

అయితే ఈ చిత్రానికి నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తుండగా మలయాళ బ్యూటీ “నివేదా పేతురాజ్” హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత “దిల్ రాజు” నిర్మిస్తున్నాడు.

ఈ విషయం ఇలా ఉండగా ఈ కరోనా వైరస్ సెకండ్ వేవ్ మళ్లీ కలకలం సృష్టిస్తున్న కారణంగా ఇప్పటికే పలు సినిమా షూటింగులు మరియు సీరియల్ షూటింగులను కూడా నిలిపివేశారు.దీంతో మరింతకాలం ఇలాంటి పరిస్థితులే కొనసాగితే కేజిఎఫ్ చాప్టర్ – 2 ఆచార్య, అఖండ, తదితర భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.

దీంతో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థుతులని బట్టి చూస్తే ఓటిటిలో విడుదల చేయడమే మంచిందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube