వైఎస్ జగన్ కి థాంక్స్ చెప్పిన పంచ్ ప్రసాద్ అసలేం జరిగిందంటే..?

జబర్దస్త్ షో( Jabardasth Show ) ద్వారా పాపులర్ అయిన నటుల్లో పంచ్ ప్రసాద్( Panch Prasad ) ఒకరు అయితే ఆయనకి చాలా రోజుల నుంచి అనారోగ్య పరిస్థితులను ఎదురుకుంటు వస్తున్నారు.ఇక ఈయనకు రెండు కిడ్నీలు పాడవడంతో గత కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటూ అలాగే జీవనం గడుపుతున్నారు.

 What Happened To Punch Prasad Who Thanked Ys Jagan , Punch Prasad, Ys Jagan, Cm-TeluguStop.com

అయితే ప్రస్తుతం తనకు సర్జరీ ఎంతో అవసరమని అది కూడా వెంటనే చేయాలి అంటూ డాక్టర్లు చెప్పడంతో ఈయన సర్జరీకి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే సర్జరీ కోసం పెద్ద ఎత్తున డబ్బు అవసరం ఏర్పడింది.ఈ విధంగా సర్జరీ కోసం పెద్ద ఎత్తున డబ్బు అవసరం కావడంతో అంత డబ్బు తన వద్ద లేకపోవడం వల్ల దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

త్వరలోనే ఈయన సర్జరీ కూడా ప్రారంభం కాబోతోంది.అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం( AP Govt ) తనకు చేసినటువంటి సహాయం పట్ల ప్రసాద్ స్పందించారు.ఈ సందర్భంగా ప్రసాద్ సోషల్ మీడియా వేదిక ఒక వీడియోని షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.ఇందులో ఏపీ ప్రభుత్వానికి అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డికి ( CM Jaganmohan Reddy )ముందుగా కృతజ్ఞతలు తెలిపారు.

 What Happened To Punch Prasad Who Thanked YS Jagan , Punch Prasad, YS Jagan, CM-TeluguStop.com

మీరు చేసిన సహాయాన్ని జీవితంలో మర్చిపోలేని తెలియజేశారు.

మంత్రి ఆర్కే రోజా తన ఆరోగ్య పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో సీఎం రిలీఫ్ ఫండ్( CM Relief Fund ) నుంచి తన చికిత్సకు సరిపడా నిధులు మంజూరు అయ్యాయి అంటూ ఈయన ఎమోషనల్ అవుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.త్వరలోనే ఈయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరగబోతుందని తెలుస్తోంది…అయితే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ సక్రమం గా జరిగి ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుందాం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube