యూఎస్, కెనడాలకు డైరెక్ట్ ఫ్లైట్స్ నడపండి... విదేశాంగ శాఖను కోరిన పంజాబ్ ఎన్ఆర్ఐ మంత్రి

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం లక్షలాది మంది భారతీయులు వివిధ దేశాలకు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అక్కడే కుటుంబంతో సహా స్థిరపడుతున్నారు.

 Punjab Nri Affairs Minister Kuldeep Dhaliwal Meets Union Minister V Muraleedhara-TeluguStop.com

మనదేశంలో పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలను కలిగివున్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి.స్వాతంత్య్రానికి పూర్వమే పంజాబీలు కెనడా, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో స్థిరపడ్డారు.

ఇక గల్ఫ్‌ దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో పంజాబీ ప్రవాసులు వున్నట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.ఆయా దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సాయపడుతున్నారు.

గ్రామాలను దత్తత తీసుకోవడం, పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు, విద్య, ఉపాధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ప్రవాసుల సంక్షేమానికి పంజాబ్ కృషి చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ బుధవారం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ను కలిశారు.అమృత్‌సర్, చండీగఢ్ విమానాశ్రయాల నుంచి కెనడా, యూఎస్, ఆస్ట్రేలియా, యూకేలకు నేరుగా విమానాలు నడిచేలా చొరవ తీసుకోవాలని కోరారు.అలాగే అత్యవసర పరిస్ధితుల్లో పంజాబీ కమ్యూనిటీ కోసం 24 గంటల పాటు నడిచే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని ధాలివాల్ విజ్ఞప్తి చేశారు.

భారతదేశంలోని విదేశీ పౌరుల వీసాలకు సంబంధించి వేగవంతమైన ప్రాసెసింగ్, సింగిల్ విండో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు.

ఇకపోతే.

కొద్దిరోజుల క్రితం లండన్- చండీగఢ్ మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభించాలని చండీగఢ్‌లోని బ్రిటీష్ డిప్యూటీ హైకమీషనర్‌ కరోలిన్ రోవెట్‌ను కోరారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్.ఇతర రాష్ట్రాలకు చెందిన భారతీయులతో పాటు యూకేలో స్థిరపడిన పంజాబీ ప్రవాసులకు సౌకర్యాలు కల్పించడానికి బ్రిటీష్ కమీషనర్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని ఈ సందర్భంగా కరోలిన్ హామీ ఇచ్చారు.

తక్షణం డైరెక్ట్ ఎయిర్ లింక్ ఆవశ్యకతను నొక్కి చెప్పిన భగవంత్ మాన్.చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయం .పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ ప్రజలకు సేవలు అందిస్తోందని చెప్పారు.ఈ ఎయిర్‌పోర్ట్‌లో బోయింగ్ 777 వంటి భారీ విమానాలను ల్యాండ్ చేయడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు వున్నట్లు కరోలిన్ దృష్టికి తీసుకెళ్లారు.

CAT-IIIB ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్‌తో పాటు అంతర్జాతీయ విమానాలను నిర్వహించడానికి అత్యాధునిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు సీఎం భగవంత్ మాన్ వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube