బాలీవుడ్ స్టార్ హీరో కండలవీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అయితే పైకి నవ్వుతూ యాక్టీవ్ గా కనిపించే సల్మాన్ ఖాన్ ఒక వింత బాధతో బాధపడుతున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
సల్మాన్ ఖాన్ వ్యాధితో బాధ పడుతున్నారు అని తెలుసుకున్న అభిమానులు ఆందోళన పడుతున్నారు.మరి సల్మాన్ ఖాన్ బాధపడుతున్న ఆ వింత వ్యాధి పేరు ఏమిటి? దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు ఒక వింత వ్యాధి ఉన్న సంగతి చాలా కాలం కిందటే బయటపడిన విషయం తెలిసిందే.
అయితే అప్పట్లో సల్మాన్ ఖాన్ తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ధూమపానం మానేస్తున్నట్లు ఒప్పుకున్న విషయం తెలిసిందే.
సల్మాన్ ఖాన్ గత కొన్నేళ్లుగా ట్రైజెమినల్ న్యూరాల్జియాతో సల్మాన్ బాధపడుతున్నారు.బాడీగార్డ్ సినిమా విడుదల సమయంలో అంటే 2011 ఆగస్టు నెలలో భరించలేని నొప్పి కారణంగా దాని సర్జరీ కోసం లాస్ ఏంజెల్స్ వెళ్లాల్సి వచ్చింది.
అయితే అక్కడ సర్జరీ చేసినా డాక్టర్లు సల్మాన్ ఖాన్ కు చాలా జాగ్రత్తలు చెప్పారు.ఆ తరువాత కూడా మరొకసారి ఈ వ్యాధి ఆయనను ఇబ్బంది పెట్టింది.
దీంతో ఈ వ్యాధికి చికిత్స పొందడానికి సల్మాన్ అమెరికా కూడా వెళ్లారు.
ఈ ట్రైజెమినల్ న్యూరాల్జియా అనేది మనిషి ముఖ నరాల నుంచి ప్రారంభమయ్యే వ్యాధి.అయితే ఈ వ్యాధి మనిషి తలపై కూడా ప్రభావం చూపుతుంది.ఒక రకంగా ఇది నాడీ సంబంధిత రుగ్మత, దీనిలో భరించలేని నొప్పి ఒక విద్యుత్ షాక్ లాగా అనిపిస్తూ ఉంటుంది.
తాజాగా ఈ విషయాన్ని సల్మాన్ ట్యూబ్‌లైట్ అనే పాట ఆవిష్కరణ కార్యక్రమంలో వెల్లడించాడు.ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో సల్మాన్ మాట్లాడుతూ.తాను ట్రైజెమినల్ న్యూరాల్జియా తీవ్ర నరాల బలహినతతో బాధపడ్డానని గుర్తు చేస్తున్నారు.
ఈ వ్యాధి వల్ల నేను ఎక్కువ సేపు మాట్లాడలేక పోయేవాడినన్న ఆయన మాట్లాడితే నా ముఖ భాగం చాలా నొప్పిగా అనిపించి మూతి వంకర పోతుందని అన్నారు.బ్రష్ చేసుకున్నా, మేకప్ వేసుకున్న నొప్పి తీవ్రంగా ఉండేది అని చెప్పుకొచ్చాడు.ఇక రాత్రి సమయంలో ఈ నొప్పి చాలా ఎక్కువగా ఉండేది, ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చేదని సల్మాన్ వెల్లడించారు.
అయితే ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నానని, దీని కోసం అమెరికాలో చికిత్స తీసుకుంటున్నట్లు కూడా సల్మాన్ తాజాగా వెల్లడించారు.