Srileela : తొలిముద్దు విషయంలో అబద్ధం చెప్పి అడ్డంగా దొరికిపోయిన శ్రీలీల?

శ్రీలీల( Srileela ).తెలుగు సినిమా ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు.

 Actress Sreeleela Comments First Lip Kiss Were False-TeluguStop.com

ఈ ముద్దుగుమ్మ నటించినది కేవలం మూడు సినిమాల అయినప్పటికీ ఈమె క్రేజ్ మాత్రం మామూలుగా లేదు.అతి తక్కువ సమయంలోనే వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ లీల భగవంతుకేసరి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

భగవంత కేసరి సినిమాలో బాలయ్య బాబు( Balayya Babu ) కూతురి పాత్రలో నటించింది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Telugu False, Firt Lip, Lip, Sreeleela, Tollywood-Movie

ఇది ఇలా ఉంటే ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించిన సందర్భంగా శ్రీ లీల ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది.అందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ మొదటి ముద్దు విషయం గురించి స్పందించింది.కానీ ఇదే విషయంలో పూర్తిగా దొరికిపోయింది.ఒక ఇంటర్వ్యూలో యాంకర్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది.తెలుగులో లిప్ కిస్ చేయాలంటే ఏ హీరోతో చేస్తారు? అని అడగ్గా.నేను ఏ హీరోతో లిప్‌లాక్ సీన్‌లో నటించను.

అలా చేయాల్సి వస్తే నా మొదటి ముద్దు నా భర్తకే ఇస్తాను అని శ్రీలీల తెలిపింది.

Telugu False, Firt Lip, Lip, Sreeleela, Tollywood-Movie

పెళ్లి చేసుకున్నాక భర్తనే ముద్దు పెట్టుకుంటానని చెప్పిన శ్రీలీల తను గతంలో ఇలాంటి సీన్ చేసిన విషయం మర్చిపోయి, పొరపాటున అబద్ధం చెప్పిసేంది.టీనేజ్‌లో ఉండగానే శ్రీలీలకు హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది.అలా కన్నడలో 2019లోనే కిస్ ( kiss )అనే చిత్రంలో నటించింది.

దీన్ని తెలుగులో ఐ లవ్ యూ ఇడియట్ పేరుతో కొన్ని నెలల ముందు రిలీజ్ చేశారు.ఇందులో ఒక సీన్‌లో హీరోయిన్ ప్రేమని వ్యక్తపరుస్తుంది.ఆ తర్వాత హీరోని పెదాలపై ముద్దు కూడా పెట్టుకుంటుంది.దీంతో శ్రీలీల తాజా కామెంట్స్ అబద్ధమని తేలిపోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube