Srileela : తొలిముద్దు విషయంలో అబద్ధం చెప్పి అడ్డంగా దొరికిపోయిన శ్రీలీల?

శ్రీలీల( Srileela ).తెలుగు సినిమా ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు.

ఈ ముద్దుగుమ్మ నటించినది కేవలం మూడు సినిమాల అయినప్పటికీ ఈమె క్రేజ్ మాత్రం మామూలుగా లేదు.

అతి తక్కువ సమయంలోనే వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ లీల భగవంతుకేసరి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

భగవంత కేసరి సినిమాలో బాలయ్య బాబు( Balayya Babu ) కూతురి పాత్రలో నటించింది.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

"""/" / ఇది ఇలా ఉంటే ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించిన సందర్భంగా శ్రీ లీల ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది.

అందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ మొదటి ముద్దు విషయం గురించి స్పందించింది.

కానీ ఇదే విషయంలో పూర్తిగా దొరికిపోయింది.ఒక ఇంటర్వ్యూలో యాంకర్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది.

తెలుగులో లిప్ కిస్ చేయాలంటే ఏ హీరోతో చేస్తారు? అని అడగ్గా.నేను ఏ హీరోతో లిప్‌లాక్ సీన్‌లో నటించను.

అలా చేయాల్సి వస్తే నా మొదటి ముద్దు నా భర్తకే ఇస్తాను అని శ్రీలీల తెలిపింది.

"""/" / పెళ్లి చేసుకున్నాక భర్తనే ముద్దు పెట్టుకుంటానని చెప్పిన శ్రీలీల తను గతంలో ఇలాంటి సీన్ చేసిన విషయం మర్చిపోయి, పొరపాటున అబద్ధం చెప్పిసేంది.

టీనేజ్‌లో ఉండగానే శ్రీలీలకు హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది.అలా కన్నడలో 2019లోనే కిస్ ( Kiss )అనే చిత్రంలో నటించింది.

దీన్ని తెలుగులో ఐ లవ్ యూ ఇడియట్ పేరుతో కొన్ని నెలల ముందు రిలీజ్ చేశారు.

ఇందులో ఒక సీన్‌లో హీరోయిన్ ప్రేమని వ్యక్తపరుస్తుంది.ఆ తర్వాత హీరోని పెదాలపై ముద్దు కూడా పెట్టుకుంటుంది.

దీంతో శ్రీలీల తాజా కామెంట్స్ అబద్ధమని తేలిపోయాయి.

4 మందారం పువ్వులతో ఇలా చేశారంటే నెల రోజుల్లో మీ జుట్టు అవుతుంది డబుల్..!