ఎంఎం కీరవాణి( MM Keeravani ) ఈ పేరు గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలకు మంచి మంచి పాటలు కంపోజ్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు కీరవాణి.
ఇక ఆయన చివరగా గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాకు మంచి మంచి పాటలను అందించి గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఆయన జనవరి 14న విడుదల కాబోతున్న నా సామిరంగ( Naa Saami Ranga ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత ఆయన నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా కీరవాణితో స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు.ఈ నేపథ్యంలోనే అనేక విషయాల గురించి ఆయన తెలిపారు.ఆస్కార్ అందుకున్న తర్వాత వస్తున్న ఈ చిత్రం ఎంత స్పెషల్ ? ఆ హైప్ పని చేస్తుందా? అన్న ప్రశ్నకు కీరవాణి స్పందిస్తూ.ప్రతి సినిమాలనే ఉంది.నిజానికి ఆస్కార్( Oscar ) తో సినిమాకి ఎలాంటి లాభం, ఉపయోగం ఉండదు.నేను బాగా పాటలు కంపోజ్ చేయాలి.దర్శకుడు బాగా తీయాలి.
ప్రేక్షకులు కనెక్ట్ కావాలి.అంతే అని తెలిపారు.
నాగార్జున గారితో చాలా రోజుల తర్వాత పని చేయడం ఎలా అనిపించింది? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.ఆయనతో పని చేయడం నాకు అలవాటైన విద్య.
ఒక్కసారి నమ్మితే మరో ఆలోచన లేని వ్యక్తి నాగార్జున.ఈ సినిమా ప్రెసిడెంటు గారి పెళ్ళాం చిత్రం లాంటి వైబ్ తో వుంది.మరో ప్రెసిడెంటు గారి పెళ్ళాం అవుతుందనే నమ్మకం వుంది అని కీరవాణి తెలిపారు.
ఈ సినిమా చేయడానికి మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు? అని అడగగా.డబ్బు.ఇంతకంటే ఆకర్షించే అంశాలుఏమి ఉంటాయి అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
ఇప్పుడు పాటలన్నీ వైరల్ అయితేనే హిట్ అంటున్నారు కదా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.నిజమే.
కానీ వైరల్ అనేది మన చేతిలో లేదు కదా.ఒకప్పుడు బ్యాండ్ వాళ్ళు పాట వాయిస్తే హిట్, ఇప్పుడు కుప్పలు తెప్పలుగా రీల్స్, వ్యూస్ వస్తే హిట్టు అని తెలిపారు కీరవాణి.