రూ.1000 కోట్లు సాధించిన కల్కి.. ఎన్టీఆర్, బన్నీ, చరణ్ సినిమాలు ఈ రికార్డ్ బ్రేక్ చేస్తాయా?

టాలీవుడ్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం కల్కి కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ).నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.

 Will These Movies Break Kalki 2898 Ad Records, Kakli 2898 Ad, Collections, Tolly-TeluguStop.com

ఈ సినిమా విడుదల అయ్యి మూడు వారాలు దాటినా కూడా ఈ సినిమా మేనియా ఇంకా తగ్గడం లేదు.రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.

సినిమా మొదటి షోకే సూపర్ హిట్ టాక్ రావడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.ఈ సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశం అన్ని హైలైట్ గా ఉన్నాయని చెబుతున్నారు.

Telugu Kakli Ad, Prabhas, Tollywood, Break Kalki Ad-Movie

సినిమాను చూసిన ప్రతి ఒక్కరు కూడా దర్శకుడిని అలాగే హీరో హీరోయిన్ నటీనటులను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు( Celebrities ) కూడా ఈ సినిమాపై స్పందించిన విషయం తెలిసిందే.ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కేవలం మూడు సినిమాలు మాత్రమే 1000 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్ ను అందుకోగా ఆ మూడు సినిమాల్లో కల్కి 2898 ఏడీ సినిమా ఒకటి కావడం గమనార్హం.స్టార్ హీరోలలో పభాస్ రికార్డులను క్రియేట్ చేయడంతో పాటు తను సాధించిన రికార్డులను తనే తిరగరాయడం ద్వారా ప్రశంసలను అందుకుంటూ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు.

ప్రభాస్( Prabhas ) రేంజ్ అంతకంతకూ పెరగడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

Telugu Kakli Ad, Prabhas, Tollywood, Break Kalki Ad-Movie

కల్కి సినిమా 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల మార్క్ ను అందుకున్న నేపథ్యంలో ఈ ఏడాది రిలీజ్ కానున్న క్రేజీ సినిమాలలో ఆ మార్క్ ను క్రాస్ చేసే సినిమా ఏదనే చర్చ జరుగుతోంది.పుష్ప2, గేమ్ ఛేంజర్, దేవర ( Pushpa2, Game Changer, Devara )సినిమాలలో మూడు సినిమాలకు ఆ ఛాన్స్ ఉండగా ఏ సినిమా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి మరి.మరి ప్రభాస్ రికార్డును అల్లు అర్జున్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు బ్రేక్ చేస్తారో లేదో చూడాలి మరి.అయితే కల్కి సినిమాకు ఇంకా అవకాశాలు ఉండడంతో ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube