మరికొద్ది నెలల్లో జరగబోతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ, టిడిపి ,జనసేన ,బిజెపిలు ( YCP TDP Janasena BJP )సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి.ఎవరికి వారు గెలుపు ధీమాతో నే ఉన్నారు.
ముఖ్యంగా అధికార పార్టీ వైసిపి సంక్షేమ పథకాలను నమ్ముకుంది .ఎప్పుడు లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వ హయాంలోనే అమలు చేశామని, ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వివిధ పథకాల పేరుతో జమ చేసామని , ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రభుత్వ పథకాలను వారి ఇళ్ల వద్దకే చేర్చామని , అందుకే అధికారం కట్టబెడతారు అనే నమ్మకంతో వైసిపి ఉంది.ముఖ్యంగా పదేపదే ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ. వాటి ప్రాధాన్యతను పార్టీ శ్రేణులకు వివరిస్తూ. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న మంచిని గురించి ప్రచారం చేయాలని సూచిస్తున్నారు.అయితే సంక్షేమ పథకాలు ఎంతవరకు పనిచేస్తాయి ? సంక్షేమ పథకాలను చూసే మళ్లీ వైసిపికి ప్రజలు ఏకపక్షంగా ఓటు వేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

జగన్ మాత్రం తమను సంక్షేమ పథకాలే అధికారంలో కూర్చోబెడతాయనే నమ్మకంతో ఉన్నారు .దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల నిధులను నేరుగా లబ్ధిదారులకు అందించామని, దాదాపు మూడున్నర లక్షల కుటుంబాలకు మేలు జరిగేలా చేసామని గొప్పగానే చెబుతున్నారు.ఇక టిడిపి అధినేత చంద్రబాబు విషయానికి వస్తే సంక్షేమ పథకాల విషయంలో జగన్ ( CM jagan ) ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నారని, పక్క రాష్ట్రమైన తెలంగాణలో కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేసినా, అక్కడ ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించారని, అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా సంక్షేమ పథకాల ను అమలు చేసి తీరుతాయి అనే అభిప్రాయాలు జనాల్లో ఉండడంతోనే బీఆర్ఎస్ కు ఓటమి ఎదురైందనే లెక్కలు వేసుకుంటున్నారు.తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ ఫలితాలు వస్తాయని , అధికార పార్టీని జనం ఇంట్లో కూర్చోబెడతారని నమ్ముతున్నారు.

ముఖ్యంగా జనసేన పార్టీతో టిడిపికి ఉన్న పొత్తు బాగా కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు.అయితే ఇక్కడే ఓ సంగతి ప్రస్తావన కు వస్తుంది .మాజీ ఐఏఎస్ అధికారి లోక్ సత్తా మాజీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ( Jayaprakash Narayan ) గతంలో చెప్పిన ఓ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.జగన్ ఈసారి కనుక ఓటమి చెందితే , చంద్రబాబు సంక్షేమ పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయరని , భారీ స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేసినా.
జగన్ ను ప్రజలు ఆదరించలేదు కాబట్టి , తమనూ పట్టించుకోరనే అభిప్రాయంతో అభివృద్ధి పైన ఎక్కువ ఫోకస్ చేస్తారని జేపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తావనకు వస్తున్నాయి.అయితే గెలుపుపై జగన్ మాత్రం( CM jagan ) చాలా ధీమా గానే ఉన్నారు.