1.రాజ్ భవన్ లో మహిళా దర్బార్

తెలంగాణలో వరుసగా అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ రాజ్ భవన్ లో మహిళా దర్బార్ నిర్వహించారు.
2.టెట్ ను వాయిదా వేయాలి : రేవంత్ రెడ్డి

తెలంగాణలో టెట్రే ను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
3.12 న భార్య బాధితుల సంఘం కోర్ కమిటీ ఏర్పాటు
భార్య బాధితుల సంఘం ఆధ్వర్యంలో కోర్ కమిటీని ఈనెల 12వ తేదీన ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.బాలాజీ రెడ్డి తెలిపారు.
4.కెసిఆర్ పై బండి సంజయ్ కామెంట్

సీఎం కేసీఆర్ డౌన్ ఫాల్ మొదలైందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
5.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు.
6.బాసరలో భక్తుల రద్దీ

ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది.
7.భద్రాచలం రామయ్య జ్యేష్ఠాభిషేకం
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 14వ తేదీన శ్రీ సీతా రామచంద్ర స్వామి వారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నారు.
8.విద్యుత్ సంస్థల్లో బదిలీల మార్గదర్శకాలు జారీ
విద్యుత్ సంస్థల్లో సాధారణ బదిలీల ప్రక్రియ మొదలైంది.దక్షిణ డిస్కమ్, ఉత్తర డిస్కమ్ లలో ఈనెల 30 నాటికి ఒకేచోట మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి విధిగా బదిలీలు చేయనున్నారు.
9.పద్మశ్రీ సురభి నాగేశ్వరరావు కన్నుమూత

సురభి నాటకాన్ని అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించి తెలుగు రంగస్థల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రేకందార్ నాగేశ్వరరావు గుండెపోటుతో మరణించారు.
10.శాంతిభద్రతలపై అఖిలపక్ష భేటీ కి డిమాండ్
తెలంగాణలో శాంతిభద్రతలపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని సీఎం కేసీఆర్ ను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు.
11.గెస్ట్ లెక్చరర్ లకు 30 శాతం జీతం పెంపు

జూనియర్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్న వారికి 30 శాతం జీతాలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
12.ఏపీ జెన్ కో పిటిషన్ ఉపసంహరణ
తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి రూ.6,283 కోట్ల బకాయిలు రావాలని పేర్కొంటూ గతేడాది తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ జెన్ కో ఉపసంహరించుకుంది.
13.కోనసీమ క్రాప్ హాలిడే పై పవన్ కళ్యాణ్ స్పందన

కోనసీమ క్రాఫ్ హాలిడే పాపం వైసీపీదే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు.
14.తాడేపల్లి కరకట్ట పై రైతుల ఆందోళన
గుంటూరు జిల్లాలోని తాడేపల్లి కరకట్ట పై రైతులు ఆందోళనకు దిగారు.ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా, పచ్చని పొలాలను రోడ్ కాంట్రాక్టర్ జెసిబి లతో తొక్కిస్తున్నాడని, రైతులకు నష్ట పరిహారం చెల్లించకుండా తమ పొలాల్లోకి జెసిబి తో ఎలా వచ్చారు అని ప్రశ్నిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు.
15.బెజవాడ కనకదుర్గమ్మ దర్శించుకున్న కేంద్ర మంత్రి

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ ఈరోజు ఉదయం బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
16.శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ఈ రోజు తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దర్శించుకున్నారు.
17.చంద్రబాబు లోకేష్ పై విజయసాయిరెడ్డి విమర్శలు

టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ముసలి నాయుడు, పప్పు నాయుడు అంటూ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు.
18.పీజీ మెడికల్ సీట్ల వివాదం పై సుప్రీం కోర్టు తీర్పు
ఢిల్లీ పీజీ మెడికల్ సీట్ల వివాదం పై నేడు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.1,456 పీజీ మెడికల్ సీట్లు ఖాళీగా ఉండడం పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
19.ఎమ్మెల్సీ అనంత బాబు కస్టడీ పిటిషన్ పై విచారణ

నేడు ఎమ్మెల్సీ ఆనందబాబు కస్టడీ పిటీషన్ పై రాజమండ్రి కోర్టులో విచారణ జరగనుంది.
20.సల్మాన్ ఖాన్ కు బెదిరింపు లేఖ కేసు లో పురోగతి
ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ కు బెదిరింపు లేఖ కేసులో ముంబై పోలీసులు పురోగతి సాధించారు నటుడు సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ కు లేఖ అందించిన వ్యక్తులను ముంబై పోలీసులు గుర్తించారు.