నందమూరి బాలకృష్ణ.ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.1974లో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన.హీరోగా మారాడు.46 ఏండ్లుగా సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నాడు.తెలుగు సినిమా సీనియర్ టాప్ హీరోల్లో ఒకడిగా ఇప్పటికీ సత్తా చాటుతున్నాడు.
హీరోగా వందకు పైగా సినిమాలు చేశాడు బాలయ్య.జానపద, పౌరాణిక, సాంఘిక, చారిత్రక సినిమాల్లో నటించిన ఒకేఒక్క హీరోగా ఆయన గుర్తింపు పొందాడు.
మిగతా హీరోలతో పోల్చితే బాలయ్య ఆలోచన చాలా విలక్షణంగా ఉంటుంది.తన తోటి హీరోల్లో చాలా మంది సినిమాల ద్వారా వచ్చిన పేరుతో యాడ్స్ లో నటించి రెండు చేతులా సంపాదిస్తున్నారు.
నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా పలు యాడ్స్ లో నటిస్తున్నాడు.అయితే బాలయ్య మాత్రం ఇప్పటి వరకు ఒక్క యాడ్ కూడా చేయలేదు.అయితే తాను యాడ్స్ చేయకపోవడానికి కారణం ఉందంటాడు బాలయ్య.తన తండ్రి పెద్ద నటుడు అయినా.
ఏనాడు తను యాడ్స్ చేయలేదని చెప్పాడు.కానీ కొంత మంది ఎన్టీఆర్ ని తమ సొంత ఆస్తిగా భావించినట్లు చెప్పాడు.
ఆయన సినిమాల్లో నటించిన ఫోటోల్నే తమ కంపెనీల ఉత్పత్తుల మీద ప్రింట్ చేసుకుని పబ్లిసిటీ చేసుకునే వారని చెప్పాడు.తమకు ఇమేజ్ ఇచ్చింది జనాలు.
వాళ్లను మెప్పించేలా సినిమాలు చేయాలి.అంతే కానీ.
వాళ్లు ఇచ్చిన ప్రేమను వ్యాపారం కోసం వాడుకోకూడదు అంటాడు బాలయ్య.
తన తండ్రి కూడా ఇదే అభిప్రాయంతో ఉండేవాడని చెప్పాడు.తను కూడా ఆయన బాటలోనే నడుస్తున్నట్లు చెప్పాడు.అందుకే తాను ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ యాడ్ లో కూడా నటించలేదు అన్నాడు.
అయితే జనాలకు మేలు జరిగే యాడ్స్ ఉంటే తప్పకుండా నటిస్తాను అని చెప్పాడు.డబ్బు కోసం మాత్రం యాడ్స్ చేయబోనన్నాడు.తనకు ఉన్న సంపాదని సరిపోతుందని చెప్పాడు.ప్రజలను మోసం చేసి సంపాదించే డబ్బు తనకు వద్దు అన్నాడు నట సింహం బాలయ్య.