1.నారా లోకేష్ తో వంగవీటి రాధా భేటీ

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) తో విజయవాడ కీలక నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ భేటీ అయ్యారు.
2.ఖమ్మంలో బీజేపీ బహిరంగ సభ

ఖమ్మం లో నేడు బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది.ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) హాజరుకానున్నారు.
3.ఏపీకి వర్ష సూచన
ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
4.భారత జాగృతి కమిటీల నియామకం
భారత జాగృతి సంస్థ విస్తరణలో భాగంగా ఇటలీతో పాటు ,తెలంగాణలోని పలు కమిటీలను నియమించింది.సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత, ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
5.టిఆర్ఎస్ బీసీల వ్యతిరేక పార్టీ
టిఆర్ఎస్ బీసీల వ్యతిరేక పార్టీ అని సీనియర్ నేత మాజీ మంత్రి కృష్ణ యాదవ్ విమర్శించారు.
5.ఈటెల రాజేందర్ కామెంట్స్

విశ్వాసం కోల్పోయిన కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో డబ్బు మద్యం పోలీసులు అండతో తిరిగి అధికారంలోకి రావాలని అనుకుంటున్నారని బిజెపి ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ విమర్శించారు.
6.వైద్య, విద్య ప్రవేశాలకు కౌన్సిలింగ్
వైద్య విద్య ప్రదేశాలకు సంబంధించి కన్వీనర్ కోటాలోని రౌండ్ పూర్తయిన తర్వాతే బి కేటగిరి కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించాలని ఎంబిబిఎస్ ఆశావాహులు కోరుతున్నారు.
7.కొత్త ఓటర్లు నమోదుపై దృష్టి పెట్టండి

తెలంగాణలో నూతన ఓటర్ల నమోదు పై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ( Vikas raj )సూచించారు.
8.కెసిఆర్ పై బండి సంజయ్ విమర్శలు

సీఎం కేసీఆర్( CM KCR ) రాజకీయ వ్యభిచారిల వ్యవహరిస్తున్నారని బిజెపి తప్ప ఎవరు గెలిచినా, తనవాళ్లేనని భావిస్తున్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి విమర్శించారు.
9.ఇప్పుడు బియ్యం ఎగుమతులపై 20% సుంకం
ఇప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
10.బెట్టింగ్ నిర్వాహకులపై ఈడి దాడులు
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్న వ్యక్తులు కంపెనీల నుంచి ప్రచారంలో భాగంగా ఐదు కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఈడి అధికారులు తెలిపారు.
11.రఘురామకృష్ణం రాజు విమర్శలు
రాష్ట్ర ప్రజలను ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయడమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎత్తుగడ అని వైసిపి ఎంపీ రఘురామ కృష్ణంరాజు( Raghu Rama Krishna Raju ) విమర్శించారు.
12.విద్యార్థులకు హెల్త్ వర్సిటీ ఆప్షన్
ఎంబిబిఎస్ బీడీఎస్ సీట్లు పొందిన అభ్యర్థుల నుంచి హెల్త్ వర్సిటీ డిక్లరేషన్ కోరింది.కన్వీనర్ కోట కింద సీటు పొందిన అభ్యర్థులు వారు అదే కాలేజీలో కొనసాగేందుకు అంగీకరిస్తున్నారా లేదా అన్న దానిపై వర్సిటీకి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరింది.
13.సెట్ కౌన్సిలింగ్ కు షెడ్యూల్
ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించి సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఉన్నత మండలి విడుదల చేసింది.
14.ఏపీటీఎఫ్ ధర్నాలు
ఉపాధ్యాయులకు మూడు నెలలు పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉదయం ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్ ప్రకటించింది.
15.వైసిపి ఎమ్మెల్యేలపై విమర్శలు

రాష్ట్రంలోని 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉత్త వాజమ్మల తయారయ్యారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.
16.కేఏ పాల్ ఆమరణ నిరాహార దీక్ష

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపటి నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏ పాల్( K.A.Pau ) ప్రకటించారు.
17.విద్యాసంస్థల్లో మత ప్రచారం చేస్తే కఠిన చర్యలు
విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు మత ప్రచారం కుల ప్రస్తావనలు తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్ పర్సన్ కేసరి అప్పారావు హెచ్చరించారు.
18.హైకోర్టు జడ్జితో విచారించాలి
తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలు భారీ మొత్తంలో అవకతవకలు జరిగాయని వాటిపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు.
19.తెలంగాణలో కోకోకోలా పెట్టుబడులు

తెలంగాణలోని మరిన్ని పెట్టుబడులకు కోకోకోలా ముందుకు వచ్చిందని మంత్రి కేటీఆర్( Minister KTR ) తెలిపారు.సిద్దిపేట ప్లాంట్ లో అదనంగా 647 కోట్లు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు.
20.మైనంపల్లి హనుమంతరావు కామెంట్స్
మెదక్ ప్రజలు నాకు రాజకీయ బిక్ష పెట్టారని మల్కాజ్.
గిరి ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆదరించాలని, ప్రాణం పోయేవరకు మాటపైనే ఉంటానని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యానించారు.