చాలా మంది ప్రజలు ఫిష్ అక్వేరియము( Fish aquarium )ను ఒక అభిరుచిగా ఇంట్లో ఉంచుకుంటారు.ఇది కొన్ని సార్లు వాస్తు దోషాలు ( Vastu Doshas )రియు అనేక ఇతర సమస్యలకు కారణమవుతుంది.
వాస్తు శాస్త్రంలో మానవ జీవితంలో వచ్చే సమస్యలను తొలగించడానికి అనేక సులభమైన మరియు ఖచ్చితమైన మార్గాలు వెల్లడించారు.దానిని స్వీకరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతంగా చేసుకోవచ్చు.
అంతే కాకుండా వాస్తు శాస్త్రంలో చేపల అక్వేరియం ఉంచడానికి సరైన దిశ విధానం మరియు నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు ఇంట్లో సరైన స్థలంలో చేపల అక్వేరియం ఉంచినట్లయితే అది మీకు అదృష్టానికి మూలంగా మారుతుంది.అలాగే పండితులు( Scholars ) చెప్పిన దాని ప్రకారం చేపలను ఇంట్లో ఉంచే వ్యక్తి జీవితంలో సానుకూలత పెరుగుతుందని మరియు విజయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయని చెబుతున్నారు.అందుకే మీ ఇంట్లో ఫిష్ అక్వేరియం కూడా ఉంచుకోవచ్చు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చేపల అక్వేరియం ఉంచడానికి అత్యంత పవిత్రమైన మరియు ఉత్తమమైన ప్రదేశం ఈశాన్య దిశ అని నిపుణులు చెబుతున్నారు.

ఈ దిశలో ఫిష్ అక్వేరియం ఉంచడం వల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది.అలాగే ఇంట్లో ఒత్తిడితో కూడిన వాతావరణం దూరమవుతుంది.ఇంకా చెప్పాలంటే మీ ఇంట్లో ఫిష్ అక్వేరియం ఉంటే దానీ నీటిని ఎప్పటికప్పుడు మార్చడం ఎంతో ముఖ్యం.
ఇలా చేయడం వల్ల మీరు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు.సమయానికి నీటిని మార్చడం వల్ల మీ పురోగతికి ఆటంకం కలగకుండా ఉంటుంది.అలాగే చేపల అక్వేరియమును పొరపాటున కూడా వంట గదిలో ఉంచకూడదని వాస్తు శాస్త్రంలో వెల్లడించారు.అంతే కాకుండా పడక గదిలో అక్వేరియం ఉంచడం కూడా నిషేధించబడింది.
ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక సమస్యల( Financial problems )ను ఎదుర్కోవాల్సి వస్తుంది.