పెద్దపల్లి జిల్లా మంథనిలో హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు.మంథని సంక్షేమ బాలుర వసతి గృహాంలో విద్యార్థుల నిరసన కార్యక్రమం చేపట్టారు.
వసతి గృహాంలో తమకు పాడైపోయిన ఇడ్లీ సాంబర్ పెడుతున్నారని విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అది కూడా సమయానుసారం కాకుండా ఉదయం పెట్టాల్సిన ఇడ్లీని మధ్యాహ్నం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో సమాచారం అందుకున్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు బాలుర వసతి గృహాంను పరిశీలించారు.విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడుతున్నారని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో ఘటనపై జిల్లా మంత్రి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.







