Revanth Reddy: రేవంత్ రెడ్డి పై కేసు.. ఏం జరిగిందంటే..?

తెలంగాణ( Telangana ) రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ప్రతిపక్ష నాయకులకు మరియు అధికారపక్ష నాయకులకు మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.మొన్నటి వరకు అధికార బీఆర్ఎస్( BRS ) పార్టీకి బిజెపి పార్టీ మాత్రమే పోటీ ఇస్తుందని మాట్లాడినటు వంటి వ్యక్తులు, రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) టీపీసీసీ అధ్యక్షులు అయిన తర్వాత బిజెపి గ్రాఫ్ పడిపోయి కాంగ్రెస్ గ్రాఫ్ రాష్ట్రంలో పెరిగిపోయింది.

 The Case Against Revanth Reddy What Happened-TeluguStop.com

దీనికి తోడుగా కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ కు మరింత ఊపు వచ్చింది.

ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti srinivas reddy ) ని పార్టీలో చేర్చుకొని ఖమ్మంలో సభ ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ సమక్షంలో రకరకాల హామీలను ఇచ్చారు.ఇక అప్పటినుంచి కాంగ్రెస్ నాయకులంతా ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు.ఈ తరుణంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ ( Nagar karnool ) లో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీస్ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.మీ అందరి పేర్లు డైరీలో రాసి పెట్టుకుంటున్నామని, కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన వెంటనే మిత్తితో సహా చెల్లిస్తామని వ్యాఖ్యలు చేయడంతో అది వివాదాస్పదంగా మారిపోయింది.ఈ క్రమంలోని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) పై జిల్లా పోలీసు అధికారుల సంఘం అసోసియేషన్ అధ్యక్షులు గోవర్ధన్ పట్వారి నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.రేవంత్ రెడ్డి పై మరియు మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి( Vamshichandra reddy ) ,సంపత్ కుమార్ లపై ఐపిసి 153,504 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube