ఈ మధ్యకాలంలో ఎక్కువగా బ్యాంకులలోను, ప్రైవేట్ సంస్థల్లోనూ అప్పులు తీసుకునే వారు పెరిగిపోయారు.ఇంకా చెప్పాలంటే మన బంధువులకు లేదా మన పొరుగింటి వారికో కనీసం ఒక్కసారైనా అప్పు ఇచ్చి ఎంతో మంది ఇబ్బంది పడి ఉంటారు.
అప్పు తీసుకునే సమయంలో వారు మీకు ఒక నెల రోజుల్లో ఇస్తామని చెబుతూనే ఉంటారు.ఫలానా తేదీన తప్పకుండా ఇస్తా అని చెప్పేవారు కూడా ఉన్నారు.
కొందరు చెప్పిన తేదీన తిరిగి ఇస్తే, మరి కొందరేమో ప్రస్తుతం లేవు కొన్ని రోజులకు ఇస్తా అని చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు.మరికొంతమంది అప్పు ఇచ్చిన వారి నుంచి తప్పించుకుంటూ ఉంటారు.
కొన్ని రాశుల వారికి అప్పు తీసుకోవడం మాత్రమే తెలుసు కానీ ఇవ్వడం తెలియదు.
ఇంకా చెప్పాలంటే ఎవరి దగ్గర అయినా అప్పు అంటే తీసుకోవడానికి సింహ రాశి వారు ముందు ఉంటారు.
ఈ రాశి వారు మిత్రుల నుంచి, వారి లవర్స్ నుంచి కూడా ఈ రాశి వారు డబ్బులు అప్పుగా తీసుకుంటారు.ఈ రాశి వారు చెల్లిస్తారని మీరు భావిస్తే మాత్రం మీకే నష్టం జరిగే అవకాశం ఉంది.
మకర రాశి వారు డబ్బును మంచినీరు లాగా ఖర్చు చేస్తారు.ఈ రాశి వారు అప్పు చేసి మరి డబ్బుతో జలసాలు చేస్తారు.డబ్బు విషయంలో ఈ రాశి వారికి ఎలాంటి జాగ్రత్త ఉండదు.రాశి వారికి డబ్బు అప్పుగా ఇవ్వాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించడమే మంచిది.

ధనస్సు రాశి వారు స్వతహాగా మంచివారే కానీ అప్పు ను తిరిగి ఇచ్చే విషయంలో అప్పు ఇచ్చిన వారిని వీరు కూడా కాస్త ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది.ఈ రాశి వారు అప్పుడప్పుడు అప్పు తీసుకున్న తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయే అవకాశం కూడా ఉంది.కాబట్టి ధనస్సు రాశి వారికి అప్పు ఇచ్చినట్లయితే ఈ విషయాన్ని పదేపదే గుర్తు చేయడం మంచిది.లేదంటే తిరిగి ఇవ్వడం కాస్త కష్టం అయ్యే అవకాశం ఉంది.