ఈ రోజుల్లో బరువు తగ్గించుకోవటం అనేది చాలా కష్టమైన పనిగా మారిపోయింది.బరువు తగ్గటానికి కొందరు వ్యాయామాలు చేస్తూ ఉంటే మరి కొందరు డైట్ ని ఫాలో అవుతున్నారు.
డైట్ ల విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో అందరిని ఆకర్షించే డైట్ కీటో డైట్.ఈ డైట్ ని ఫాలో అయితే బరువును తొందరగా తగ్గించుకోవటమే కాకూండా డయాబెటిస్, జీర్ణ సమస్యలు రావని డాక్టర్స్ చెప్పటంతో చాలా మంది ఈ కీటో డైట్ ని ఫాలో అవుతున్నారు.
ఈ డైట్ లో పిండి పదార్దాలు తగ్గించి కొంచెం ప్రోటీన్స్,కొవ్వులు ఎక్కువగా ఇస్తారు.ఈ డైట్ వలన లాభాలు ఉన్న కొన్ని చెడు ప్రభావాలు కూడా ఉన్నాయి.
వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
కీటో డైట్ కారణంగా శరీరం ఎప్పుడు కీటోసిస్‌లో ఉంటుంది.
మన శరీరం శక్తి కొరకు పిండిపదార్ధాలపై ఆధారాపడుతుంది.కానీ ఈ కీటో డైట్ లో కొవ్వులపై ఆధారపడుతుంది.
రక్తంలో ఎక్కువగా కీటోన్లు ఉంటాయి.వాటి ద్వారా శరీరానికి శక్తి లభిస్తుంది.
శరీరం కీటోసిస్‌లో ఉండుట వలన శరీరానికి అవసరమైన కాల్షియం, ఫైబర్ సరిగా అందవు.దాంతో ఎముకలు బలహీనం అవుతాయి.
ఈ డైట్ లో పిండిపదార్ధాలు తక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పొటాషియం, కాల్షియం, సోడియంలు సరిగ్గా లభించవు.దీంతో కండరాలు సరిగ్గా పనిచేయక బిగుసుకుపోయినట్టు అవుతాయి.దీంతో కండరాలు పట్టేస్తుంటాయి.విపరీతమైన నొప్పి కలుగుతుంది.
అలాగే కండరాల పనితీరు మందగిస్తుంది.

శరీరం కీటోసిస్ లో ఉండుట వలన ఎప్పుడు అలసటగానే ఉంటుంది.శరీరానికి గ్లూకోజ్ అందకపోవటంతో వేరే ప్రత్యామ్నాయాలపై ఎక్కువగా ఆధారపడటం వలన నీరసం,అలసట వస్తాయి.ఎక్కువగా వ్యాయామం చేయలేరు.
శరీరం ఎల్లప్పుడూ కీటోసిస్‌లో ఉండడం వల్ల రక్తం పీహెచ్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి.దాంతో రక్తం ఆమ్లతత్వాన్ని (అసిడిక్) కలిగి ఉంటుంది.దాని ఫలితంగా కిడ్నీల్లోకి ఆ రక్తం ప్రవహించినప్పుడు రక్తంలో ఉండే అసిడిక్ గుణం వల్ల కిడ్నీల్లో ఉండే వ్యర్థ పదార్థాలు రాళ్లుగా మారుతాయి.అంటే కిడ్నీ స్టోన్లు తయారవుతాయి.
శరీరం ఎల్లప్పుడూ కీటోసిస్‌లో ఉండడం వల్ల నోటి దుర్వాసన ఎక్కువ అవుతుంది.ఎందుకంటే శరీరం పిండి పదార్థాలను కాకుండా కొవ్వులను కరిగిస్తూ శక్తి గ్రహిస్తుంది.కనుక వాటిల్లో ఉండే కెమికల్స్ నోటి దుర్వాసనకు కారణమవుతాయి.
మనం ప్రతి రోజు తీసుకొనే పిండిపదార్ధాలలో ఫైబర్ ఉంటుంది.
ఈ కీటో డైట్ లో పిండిపదార్ధాలు తక్కువగా తీసుకోవటం వలన శరీరానికి అవసరమైన ఫైబర్ అందదు.దాంతో ప్రేగుల కదలికలు తగ్గి మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి.