ముఖ్యంగా చెప్పాలంటే దేవుళ్లలో మొదటి పూజా అందుకునే దేవుడు వినాయకుడు( Ganesha ) అని దాదాపు చాలామందికి తెలుసు.ఆది దేవుడు అయినా గణపతికి ప్రతి సంవత్సరం భద్రపద శుక్రచవితి రోజున వినాయక చవితిని జరుపుకుంటారు.
ఈ రోజు నుంచి పది రోజులు ఈ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి.ఈ సంవత్సరం దక్షిణ భారతదేశంలో సెప్టెంబర్ 18వ తేదీన, ఉత్తర భారత దేశంలో సెప్టెంబర్ 19వ తేదీన వినాయక చవితి( Vinayaka Chavithi ) మొదలవుతుంది.
ప్రతి శుభకార్యం లో తొలి పూజ అందుకునే వినాయకునికి నవరాత్రి ఉత్సవాలలో ఇవి సమర్పిస్తే అన్ని శుభాలే జరుగుతాయని పండితులు చెబుతున్నారు.

కష్టాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే కొబ్బరినీ( Coconut ) ప్రతి శుభకార్యం లో ఉపయోగిస్తారు.
కొబ్బరికాయను శ్రీఫలం అని కూడా అంటారు.శ్రీ అంటే లక్ష్మి అని అర్థం వస్తుంది.
అంతేకాకుండా లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే ఎంతో ఇష్టం.గణేషుడికి కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే దానిని బూరు తీయకుండా పూర్తిగా మాత్రమే సమర్పించాలి.
ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు.ఇంకా చెప్పాలంటే పూజలో వినాయకుడికి సమర్పించే వాటిలో తమలపాకులు ముఖ్యమైనవి.
తమలపాకు ను వినాయకుని రూపంగా పూజిస్తారు.కొన్నిసార్లు గణేష్ విగ్రహం లేనట్లయితే తమలపాకును గణేశుడి రూపంగా పూజిస్తారు.

గణేషుడికి తమలపాకులు( Betel leaf ) నైవేద్యంగా పెట్టడం వల్ల ఇంటిలోకి శుభ ఫలితాలు వస్తాయి.అంతేకాకుండా గణేషుడికి ఏదైనా తీపి పండ్లను నైవేద్యంగా సమర్పించవచ్చు.అంతేకాకుండా మోదకాలు, లడ్డూలు, వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి.ఈ మిఠాయిలను వినాయకుడికి నైవేద్యంగా సమర్పించాలి.ఇంకా చెప్పాలంటే వినాయకుడికి గరిక అంటే ఎంతో ఇష్టం.ఎవరైతే వినాయకుడికి గరికను సమర్పిస్తారో వారి జీవితంలో ఎప్పుడూ ఆనందం ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే వినాయకుని పూజలో పసుపు ముద్దను ప్రత్యేకంగా సమర్పిస్తారు.దీనిని హరిద్ర అని కూడా పిలుస్తారు.
ఇలా చేయడం వల్ల వచ్చే కష్టాలు కూడా దూరమవుతాయని పండితులు చెబుతున్నారు.
TELUGU BHAKTHI







