ఈ ఏడాది కర్వా చౌత్ ఉపవాసం( Karva Chauth Fasting )వంబర్ ఒకటవ తేదీన జరుపుకోనున్నారు.ఈ రోజున పెళ్లి అయినా మహిళలు( women ) తమ భర్త దీర్ఘాయువు కోసం ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం కర్వా చౌత్ పండుగను కార్తీక మాసంలోని కృష్ణపక్ష చతుర్ధి రోజున జరుపుకుంటారు.చంద్రుడు ఈ రోజున మెయిన్ రోల్ పోషిస్తాడు.
ఎందుకంటే చంద్రుడు ఉదయించిన తర్వాత మాత్రమే మహిళలు తమ ఉపవాసాన్ని విరమిస్తారని పండితులు చెబుతున్నారు.ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల దాంపత్య జీవితం కూడా సుఖమయం అవుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.
కర్వా చౌత్‌తో సంబంధం ఉన్న అనేక నమ్మకాలు సంప్రదాయాలు( Traditions ) ఈ రోజున ప్రత్యేక పాత్ర పోషిస్తాయి.
కాబట్టి కర్వా చౌత్‌లో మొదటి సారి ఉపవాసం ఉంటున్నట్లయితే ఉపవాసంలో పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే మీరు కర్వా చౌత్‌లో మొదటి సారి ఉపవాసాన్ని పాటిస్తున్నట్లయితే ఈ ఉపవాసం సూర్యోదయానికి ముందే మొదలు పెట్టాలని గుర్తుపెట్టుకోవాలి.కాబట్టి ఉదయాన్నే నిద్ర లేచి పెద్దవారి ఆశీస్సులు తీసుకోవాలి.
తర్వాత సర్గీ తినడంతో ఉపవాసం ప్రారంభమవుతుంది.ఈ రోజున మీరు పూర్తి పదహారు అలంకారాలతో పూజలు కూర్చోవాలి.
అలాగే చేతులకు హెన్నాను అప్లై చేసుకోవాలి.కర్వా చౌత్ రోజున ఇలా చేయడం శుభప్రదంగా భావిస్తారు.
ఇంకా చెప్పాలంటే పెళ్లి అయినా మహిళలకు ఎరుపు రంగు శుభప్రదంగా పరిగణిస్తారు.కాబట్టి మీరు కర్వా చౌత్ ( ( Karva Chauth )రోజున ఎరుపు రంగు దుస్తులను మాత్రమే ధరించాలి.ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు దుస్తులను ధరించకూడదు.ఈ రోజున ఉదయం స్నానం చేసిన వెంటనే ఎరుపు లేదా గులాబీ రంగు దుస్తులను ధరించాలి.కర్వా చౌత్ రోజున కర్వా చౌత్ కథ వినడం ఎంతో మంచిది.ఇది లేకుండా ఉపవాసం పూర్తి కాదు.
మీరు మొదటిసారి ఈ ఉపవాసం చేస్తుంటే సరైన దిశలో కూర్చుని కథ వినడం, ఆచారాల ప్రకారం పూజ చెయ్యాలి.ఇంకా చెప్పాలంటే ఈ రోజున పొరపాటున కూడా ఇంట్లో మాంసాహారం తినకూడదు.
అలాగే మీరు కర్వా చౌత్ ను మొదటిసారి జరుపుకున్నట్లు అయితే మీరు ఈ రోజున వివాహ దుస్తులను కూడా ధరించవచ్చు.
DEVOTIONAL