గత కొన్నాళ్లుగా పాలేరు నియోజిక వర్గంకు సంబంధించిన చర్చ గట్టిగా జరుగుతోంది.అధికార బిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా ఈ సీటు పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున కందాల ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు.ఈసారి ఆయన బిఆర్ఎస్ నుంచి బరిలోకి దిగుతున్నారు.
ఇక కాంగ్రెస్ తరుపున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivasa Reddy ) బరిలోకి దిగుతున్నారు.బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు.
అయితే ఈ సీటుపై పోటీ చేసేందుకు కాంగ్రెస్ లో జరిగిన చర్చలు అన్నీ ఇన్ని కావు.
బిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivasa Reddy ), మరియు తుమ్మల నాగేశ్వరరావు వంటివారు పాలేరు( Paleru ) నుంచి పోటీ చేయాలని మొదటి నుంచి భావిస్తూ వచ్చారు.అయితే వైఎస్ఆర్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కూడా పాలేరు సీటు కోసమే కాంగ్రెస్ తో కలిసే ప్రయత్నం చేశారు.కానీ పాలేరు సీటు కేటాయించడంపై హస్తం పార్టీ ససేమిరా అనడంతో షర్మిల తన పార్టీ నుంచే పాలేరు బరిలో నిలిచారు.
దీంతో బిఆర్ఎస్ నుంచి కందాల ఉపేందర్ రెడ్డి( Kandala Upender Reddy ) , కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి వైఎస్ షర్మిల.ఇలా హేమాహేమీలంతా పాలేరు బరిలో నిలవడంతో ఈ నియోజిక వర్గంలో ఎవరు విజయ ఢంఖా మోగిస్తారనేది ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం ఎవరికి వారు గెలుపు విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.2014, 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది.అయితే ఇక్కడ కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం కూడా గట్టిగానే ఉంది.ఈ నేపథ్యంలో నియోజిక వర్గ ప్రజలు గత ఎన్నికల మాదిరిగానే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా లేదా అధికార బిఆర్ఎస్ కు పట్టం కడతారా ? అనేది చూడాలి.ఏది ఏమైనప్పటికి పాలేరు నియోజిక వర్గంలో విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.