స్వామికి నైవేద్యంగా మద్యం సిగరెట్లు సమర్పించడానికి గల కారణం ఇదే..!

సాధారణంగా చెప్పాలంటే తమ అభిమాన నాయకులకు కొంతమంది ప్రజలు పాలాభిషేకాన్ని చేస్తూ ఉంటారు.అలాగే మరి కొంతమంది నేతలకు అభిమానం ఎక్కువైతే మద్యంతో అభిషేకాలు చేయడం లాంటివి చూస్తూ ఉంటాం.

 This Is The Reason For Offering Alcohol Cigarettes To Swami , Tamil Nadu Sta-TeluguStop.com

మరికొందరు అందం కోసం చందనం, గులాబీ రేకులతో స్నానం చేస్తూ ఉంటారు.కానీ మీరు కారంతో స్నానం చేయడం ఎప్పుడైనా చూసారా? అలాగే మీరు ఎప్పుడైనా కారంతో స్నానం చేశారా? అవును మీరు చదువుతున్నది నిజమే ఒక ప్రాంతంలో కారంతో స్నానం చేస్తున్నారు.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.తమిళనాడు రాష్ట్రం( Tamil Nadu State )లోని ధర్మపురి జిల్లా నడపనహళ్లి గ్రామానికి చెందిన గోవిందం అనే పూజారి కారం నీళ్లతో స్నానం చేస్తున్నారు.

Telugu Aadi Amavasya, Alcohol, Bhakti, Chilli, Devotional, Dharmapuri, Govindam,

ప్రతి సంవత్సరం ఆది అమావాస్య( Aadi Amavasya ) రోజున నడపనహళ్లి గ్రామదేవ పెరియ కూరప్ప స్వామికి కారం, పాలతో అభిషేకం చేస్తారు.ఈ నేపథ్యంలోనే అక్కడి భక్తులు అంతా పూజారికి కారం నీళ్లతో స్నానం చేయిస్తారు.108 కేజీల కారంతో స్నానం ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.గ్రామ దేవత కరుణ కోసం 108 కేజీల కారం నీటితో పూజారికి భక్తులు స్నానం చేయిస్తారు.

అయితే ఇలా చేస్తే దుష్టశక్తులు తొలగిపోయి అందరికీ మేలు జరుగుతుందని అక్కడి భక్తులు నమ్ముతారు.ముందుగా పూజారి గోవిందం రెండు కొడవళ్లపై నిలబడి భక్తుల సమస్యలను వింటారు.

ఆ తర్వాత కారంతో స్నానం చేస్తారు.

Telugu Aadi Amavasya, Alcohol, Bhakti, Chilli, Devotional, Dharmapuri, Govindam,

పూజారి గోవిందం( Govindam ) కారం నీటితో స్నానం చేస్తుంటే ఆ ఘాటుకు భక్తులు అక్కడ నిలబడలేక పక్కకు వెళ్లిపోయారు.కానీ పూజారి గోవిందం మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా కారం నీటితో హాయిగా స్నానం చేశారు.కారం నీటితో స్నానం చేసిన తర్వాత భక్తులు మళ్లీ ఆయనపై సాధారణ నీరు పోశారు.

కారం ఘాటు పోయేంత వరకు స్నానం చేయించారు.ఈ సంప్రదాయం పూర్వం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూ ఉంది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే భక్తులు ఈ స్వామికి మద్యం,సిగరెట్లను నైవేద్యంగా సమర్పిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube