క్యాప్సికం గురించి దాదాపు చాలామందికి తెలుసు.అయితే ఇవి మూడు రంగులలో మార్కెట్లో లభిస్తాయి.
పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులలో ఇవి ఉంటాయి.అలాగే మనం ఎక్కువగా ఆకుపచ్చ, క్యాప్సికం ను వంటలలో ఉపయోగిస్తూ ఉంటాము.
కానీ ఎరుపు రంగు క్యాప్సికం( Red capsicum ) కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.వీటిలో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
మరి ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ రెడ్ క్యాప్సికం ను నార్త్ వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తారు.
అందుకే వాళ్ళు సన్నగా ఉన్న చాలా ఆరోగ్యంగా ఉంటారు.

వీటిలో విటమిన్ ఏ( Vitamin A ) ఎక్కువగా ఉంటుంది.ఇది కంటి చూపును మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.కంటికి సంబంధించి ఇతర సమస్యలను రాకుండా చేస్తుంది.
రెడ్ క్యాప్సికంలో లైకోపిన్, విటమిన్ సి విటమిన్ b6 యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.వీటిని వారానికి రెండు సార్లు అయినా ఆహారంలో తీసుకుంటే శరీరంలో జీవక్రియ రేటు మెరుగుపడుతుంది.
ఆహారం సులభంగా జీర్ణం చేయడమే కాకుండా బరువు తగ్గడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

డైట్ లో ఉన్నవాళ్లు వీటిని ఎక్కువగా వంటలలో ఉపయోగించడం ఎంతో మంచిది.ఇంకా చెప్పాలంటే రెడ్ క్యాప్సికం ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.
రోగ నిరోధక శక్తి( Immunity ) కూడా పెరుగుతుంది.రక్తహీనతను కూడా తగ్గిస్తుంది.
తీవ్రమైన ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే కీళ్ల నొప్పులను కూడా ఇది దూరం చేస్తుంది.
అందుకే గ్రీన్, ఎల్లో, క్యాప్సికం తో పాటు రెడ్ క్యాప్సికం ను కూడా ఆహారంగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.అంతేకాకుండా తాజా కూరగాయలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.