బైడెన్ కోసం ప్రెసిడెన్షియల్ సూట్.. 400 గదులు బుకింగ్, ఢిల్లీలో జీ20 సమ్మిట్ కోసం భారీ ఏర్పాట్లు

ప్రపంచంలోని అతిపెద్ద ఆర్ధిక శక్తులు, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్ధల గ్రూప్ 20 సమావేశాలు భారత్‌ వేదికగా జరగనున్నాయి.ఈ ఏడాది జీ 20కి మనదేశం అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే.

 For Biden, Presidential Suite, 400 Rooms Booked. Delhi Hotels Prep For G20 Meet-TeluguStop.com

సమావేశాల నిర్వహణ కోసం భారత్ కనివినీ ఏరుగని స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.వచ్చే నెలలో ఢిల్లీలో జీ 20 దేశాధినేతల సమావేశాలు జరగున్నాయి.

ఇందుకోసం పలు దేశాల నుంచి ప్రతినిధులు భారతదేశానికి రానున్నారు.వీరందరికీ ఢిల్లీలోని 30కి పైగా హోటళ్లు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ( Joe Biden )ఐటీసీ మౌర్య షెరటన్‌లో బస చేస్తారు.తాజ్ ప్యాలెస్ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.

మొత్తంగా ఢిల్లీలోని 23 హోటళ్లు, ఎన్‌సీఆర్‌లో తొమ్మిది హోటళ్లు జీ20 ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

ఢిల్లీలో ఏ హోటళ్లంటే :

ఐటీసీ మౌర్య, తాజ్ మాన్సింగ్, తాజ్ ప్యాలెస్, హోటల్ ఒబెరాయ్, హోటల్ లలిత్, ది లోధి, లే మెరిడియన్, హయత్ రీజెన్సీ, షాంగ్రి-లా, లీలా ప్యాలెస్, హోటల్ అశోక్, ఈరోస్ హోటల్, ది సూర్య, రాడిసన్ బ్లూ ప్లాజా, జేడబ్ల్యూ మారియట్, షెరటన్ , ది లీలా యాంబియన్స్ కన్వెన్షన్, హోటల్ పుల్‌మాన్, రోసెట్ హోటల్, ది ఇంపీరియల్.

Telugu American Secret, Biden, Hotel Oberoi, Itcmaurya, Rishi Sunak, Taj Mansing

ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలోని హోటళ్లు :

ది వివంత (సూరజ్‌కుండ్), ఐటీసీ గ్రాండ్ (గురుగ్రామ్), తాజ్ సిటీ సెంటర్ (గురుగ్రామ్), హయత్ రీజెన్సీ (గురుగ్రామ్), ది ఒబెరాయ్ (గురుగ్రామ్), వెస్ట్‌ఐఎన్ (గురుగ్రామ్), క్రౌన్ ప్లాజా (గ్రేటర్ నోయిడా).

ఎవరెవరికీ ఎక్కడ బస అంటే :

జో బైడెన్ బస చేయనున్న ఐటీసీ మౌర్య హోటల్‌లోని ప్రతి అంతస్తులో ‘అమెరికన్ సీక్రెట్ సర్వీస్’( American Secret Service ) కమాండోలు ఉంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి.14వ అంతస్థులో అధ్యక్షుడు బస చేస్తారని, ఫ్లోర్‌కు చేరుకోవడానికి ప్రత్యేక లిఫ్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు.ఈ హోటల్‌లోని దాదాపు 400 గదులు బుక్ చేయబడ్డాయి.

Telugu American Secret, Biden, Hotel Oberoi, Itcmaurya, Rishi Sunak, Taj Mansing

బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్( Rishi Sunak ) షాంగ్రి-లా హోటల్‌లో బస చేస్తారు.ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.క్లారిడ్జెస్ హోటల్‌లో బస చేయనున్నారు.ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఇంపీరియల్ హోటల్‌లో, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తాజ్ ప్యాలెస్ హోటల్‌లో బస చేయనున్నారు.

అమెరికా, బ్రిటన్‌, చైనా తదితర దేశాల నుంచి భద్రతా సిబ్బంది, ఆయా అధ్యక్షుల వ్యక్తిగత సిబ్బంది ఇప్పటికే భారత్‌కు చేరుకున్నారు.ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో టర్కీ ప్రతినిధి బృందాలు ఉంటాయని.

మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా , స్పెయిన్‌ల ప్రతినిధులు లే మెరిడియన్‌లో బస చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube