వర్షాకాలం( rainy season ) కావడంతో దేశ వ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షం నమోదు అవుతున్న పరిస్థితి.ఈ క్రమంలో కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగి పోతున్నాయి.
ఈ విషయంలో ప్రభుత్వాలు ఎంత బాధ్యత వహించినప్పటికీ సమస్యలు మాత్రం పూర్తిగా సమసిపోవడం లేదు.ఇక జనాలు చేసేదేమీ లేక వర్షాకాలంలో సొంత ఇళ్లను వదిలేసుకొని ఎక్కడికో బయటకి వెళ్ళిపోయి బతుకునీడిస్తున్న పరిస్థితులు వున్నాయి.
కానీ బీహార్‌కు చెందిన ఓ యువకుడు మాత్రం వరదలను తట్టుకునేందుకు నీటిపై తేలియాడే ఇళ్లే పరిష్కారమని నిరూపించాడు.

అవును, అతనికి ఆలోచన వచ్చిందే తడవుగా అలాంటి ఓ ఇల్లును నిర్మించి ప్రదర్శనకు ఉంచాడు.దీంతో, ఈ తంతు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దాంతో ఇంజినీర్లకు కూడా రానీ ఐడియా మనోడికి వచ్చిదంటూ అనేక మంది నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు.
విషయంలోకి వెళితే, బీహార్‌లో బక్సర్ జిల్లాలో( Buxar district in Bihar ) ఆరాహ్ అనే గ్రామంలో ఉంది.ఆ గ్రామస్థులు ప్రతి యేటా వరదల బారిన పడి నానా అవస్థలు పడుతుంటారు.
ఏటా వరదల కారణంగా ఇళ్లను వదిలిపెట్టి రెండు మూడు నెలల పాటు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతారు.ఆ తరువాత వారు తిరిగొచ్చేసరికి అక్కడ ఏమీ మిగిలుండదు.కొంపాగోడు అంతా వరదల్లో కొట్టుకుపోతుంది.

ఆ తరువాత వారు మళ్లీ అన్నిటినీ సమకూర్చుకొని కొత్త జీవితం ప్రారంభించాల్సి వస్తుంది.ఈ నేపధ్యంలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపెట్టాలని అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ కుమార్ ( Prashant Kumar )భావించాడు.ఆ తపనలోంచి పుట్టుకొచ్చిందే తేలియాడే ఇల్లు.
అవును, అతగాడు ఆ ఇల్లు కోసం చెక్క, మట్టి, ఆవు పేడ వెదురు, ఇనుప సిలిండర్లు వంటి వాటితో సంప్రదాయపద్ధతిలో దొరికేవే ఎంచుకున్నాడు.వాటితో ఇంటిని అద్భుతంగా నిర్మించాడు.
అది పూర్తిచేసిన తరువాత ఓ నదీ తీరంలో దీన్ని ఏర్పాటు చేసి ప్రదర్శనకు పెట్టాడు.కేవలం లక్ష రూపాయల ఖర్చుతో ఈ ఇంటిని నిర్మించానని ప్రశాంత్ మీడియాకు చెప్పుకొచ్చాడు.
నిజంగా అద్భుతం కదూ.







