మంత్రోపదేశానికి శుభమాసములు, వారములు, తిధులు, నక్షత్రాలు, రాశులు, సమయాలు ఏవి ?

మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా మంత్రం ఉపదేశం చేసినప్పుడు అది ఆరు చెవులకు వినపడకూడదని శాస్త్రం.అంటే గురు శిష్యుల మధ్యే ఈ మంత్రం ఉండాలి.

 What Is The Good Time For Preaching The Manthra , Devotional , Good Time For Pr-TeluguStop.com

దాన్ని ఇంకెవరూ విడనానికి లేదు.అలాగే మననం చేసే ప్రక్రియనే మంత్రం.

మననం చేసేటప్పుడు బయటకు వినపడే ప్రసక్తే లేదు.అందుకే మంత్రాన్ని గుహ్యమని అన్నారు.

అట్టి మంత్రాలను పేరు పెట్టి పిలిస్తే గుట్టు విప్పినట్లే కదా.అందుకే ప్రసిద్ధ మంత్రాలకు మన పెద్దలు అక్షర సంఖ్యను ఏర్పరిచారు.అంతే కాదండోయ్ మంత్రం ఉపదేశించేందుకు ముందు మంచి ముహూర్తాన్ని కూడా చూస్కుంటారు.అలాగే వారాలు, తిథులు, నక్షత్రాలు, రాశులు, సమయాలు ఇలా సవాలక్ష చూస్కున్నాకే మంత్రాన్ని ఉపదేశిస్తారు.

అయితే గురువు శిష్యుడికి మంత్రాన్ని ఉపదేశించిడానికి శు మాసం, వారాం, తిథి, నక్షత్రం, రాశులు, సమయాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వైశాఖము, శ్రావణము, ఆశ్వయుజము, కార్తికము, మార్గ శిరము, మాఘం, ఫాల్గుణము, అధిక మాసము మంత్రం ఉపదేశించడానికి మంచిది కాదు.

మంత్రోప దేశమునకు శుభ వారములు… సోమవారం, శుక్రవారం. మంత్రోప దేశమునకు శుభ నక్షత్రములు.

తన జన్మ నక్షత్రము నుండి 8, 9 నక్షత్రములలో అనగా తారా బలము ప్రకారము మిత్ర తార మరియు పరమ మైత్ర తార మంచి ఫలితాలను ఇనిస్తాయి.కనుక తారా బలములో 8, 9 చూచుకోవాలి.

అశ్వని, రోహిణి, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఉత్తర ఫల్గుణి, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రేవతి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube