సాధారణంగా చెప్పాలంటే లాభ స్థానం అంటే 11వ స్థానం అని నిపుణులు చెబుతున్నారు.ఈ స్థానంలో పదోన్నతులను, ఆశయ సిద్ధిని, కోరికలను నెరవేర్చడానికి సూచిస్తారు.
లాభ స్థానంలో ఏ గ్రహం ఉన్నా శుభ ఫలితాన్ని ఇస్తుందనీ జ్యోతిష్య శాస్త్రం( Astrology ) చెబుతూ ఉంది.అలాగే లాభ స్థానంలో శుభగ్రహాలు ఉంటే మరి మంచిది.
లాభ స్థానంలో ఏదైనా గ్రహం ఉన్న, లాభ స్థానాన్ని ఏదైనా గ్రహం చూసినా తప్పకుండా లాభ స్థానం ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది.దీనీ ప్రకారమే ఈ రాశుల వారి జీవితాలు కొత్త మలుపులు తిరగబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి( Mesha Rasi ) వారికి లాభ స్థానమైన కుంభంలో మూడు గ్రహాలు సంచారం చేస్తుండడం వలన వృత్తి ద్వారా పదోన్నతులకు, అధికార యోగానికి బాగా అవకాశాలు ఉన్నాయి.

ఆర్థికంగా విశేషమైన పురోగతి ఉంటుంది.నిరుపేద వ్యక్తి సైతం ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు.సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
వేగంగా ప్రగతి సాధిస్తారు పోటీదారులను, ప్రత్యర్థులను మించి పోవడం జరుగుతుంది.ఏ ప్రయత్నం తరబడిన ఆర్థికంగా బాగా లాభం వస్తుంది.
ఇక మిధున రాశి వారికి లాభ స్థానంలో గురు సంచారం వల్ల లాభ స్థానాన్ని శనీశ్వరుడు వీక్షించడం వల్ల కొద్ది శ్రమతో సంపద బాగా వృద్ధి చెందుతుంది.ఆర్థిక సమస్యలు దూరం అయిపోతాయి.
అలాగే మనసులోని కోరికలు అన్నీ నెరవేరుతాయి.తులా రాశి( Libra )కి లాభ స్థానం మీద గురువు శని రాశి అధిపతి కావడంతో, శుక్రుడి దృష్టి పడడంతో అనేక విధాలుగా ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.
లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.వృత్తి, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి.

ఉద్యోగంలో తప్పకుండా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ధనస్సు రాశికి 11 వ స్థానంలో శుక్రుడు, గురుడు దృష్టి ఉన్నందువల్ల మరో నెల రోజుల వరకు ఏ ప్రయత్నం తలపెట్టిన విజయవంతం అవుతుంది.మనసులోని కోరికలు అన్ని నెరవేరుతాయి.పదోన్నతులకు బాగా కలిసి వస్తుంది.ఆదాయం పెరుగుతుంది.మకర రాశికి లాభ స్థానమైన వృశ్చిక రాశి మీద శనీశ్వరుడి దృష్టి పడినందు వల్ల అనేకమార్గాలలో ఆర్థిక లాభాలు పెరుగుతాయి.
వృత్తి, ఉద్యోగాలలో ఆదాయ వృద్ధి ఉంటుంది.పదోన్నతులకు, అధికార యోగానికి కూడా బాగా కలిసి వస్తుంది.
నిరుద్యోగుల అంచనాలకు మించిన శుభ యోగాలు పట్టే సూచనలు ఉన్నాయి.విదేశాల నుంచి మంచి ఆఫర్లు వస్తాయి.







