హిందూమతంలో 18 మహాపురాణాల వర్ణనను మనం చూడవచ్చు.అయితే అందులో శివపురాణం అత్యంత ప్రసిద్ధ గ్రంథంగా పరిగణించబడుతుంది.
అయితే ఇది శివుని కథ, మహిమ, వివిధ రూపాలు జ్యోతిర్లింగం కథలను వివరిస్తుంది.శివ పురాణంలో పేర్కొనబడిన కొన్ని మంత్రాలు కూడా ఇందులో ఉన్నాయి.
వాటిని పఠించడం వలన శివుడు ప్రసన్నం అవుతాడు.అలాగే అతని దయతో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.
హిందూ మతంలో ఎక్కువగా పూజించబడే దేవుళ్ళలో శివుడు( Lord Shiva ) కూడా ఒకరు.నవగ్రహాలను( Navagraha ) కూడా శివుడు పరిపాలిస్తాడు.
శివుడిని పూజించడం వలన గ్రహ కాలుష్యం కూడా తొలగిపోతుంది.

అలాగే జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది.అయితే ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.శివపురాణం( Shiva Purana ) ప్రకారం ‘ఓం నమః శివాయ అనే మంత్రం శివుని ప్రభావవంతమైన మంత్రం అని చెప్పవచ్చు.
ఈ మంత్రాన్ని జపించడం వలన మన శరీరం రోగాల నుండి బయటపడుతుంది.అలాగే మనం కోరుకున్నది త్వరలోనే మన చేతుల్లోకి వస్తుంది.ఇక చాలామంది ఎన్నో రకాల కోరికలు కోరుకొని దేవుడి ముందు ఎంతగానో వేడుకుంటూ ఉంటారు.అయినప్పటికీ కూడా తమ కోరికలు నెరవేరక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు.

అయితే అలాంటివారు ఓం నమో భగవతే రుద్రాయ నమః అనే శివుని రుద్ర మంత్రం చదివితే వారు కోరుకున్న ప్రతి కోరికలు కూడా నెరవేరుతాయి.ఈ మంత్రాన్ని ప్రతి రోజు జపించడం వలన సాధకుడి కోరికలన్ని నెరవేరుతాయి.ఇక ప్రత్యేకంగా సోమవారం నాడు ఈ రెండు మంత్రాలను తరచూ జపించడం వలన మీకు మంచి ఫలితాలు ఉంటాయి.అలాగే మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.
అంతేకాకుండా ఇంట్లో ఎవరైనా అనారోగ్యం బారిన పడినట్లయితే వెంటనే వారు కోలుకుంటారు.అలాగే ఇంట్లో ఉన్నవారు నిత్యం ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉంటారు.